ఆ హీరో చెయ్యాల్సిన `ఢీ` సినిమాను కొడుకు కోసం లాగేసుకున్న మోహ‌న్ బాబు.. ఎంత స్వార్థం!?

డైలాగ్ కింగ్ మోమ‌న్ బాబు త‌న‌యుడిగా ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన మంచు విష్ణు.. ఇప్ప‌టి వ‌ర‌కు చాలా సినిమాలేచేశాడు. కానీ, అవేమి ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌లేక‌పోయాయి. విష్ణు మొత్తం కెరీర్ లో చెప్పుకోద‌గ్గ హిట్ ఏదైనా ఉంది అంటే.. అది `ఢీ` సినిమానే. శ్రీను వైట్ల ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో విష్ణు, జెనీలియా జంట‌గా న‌టించారు. శ్రీ‌హ‌రి, బ్రహ్మానందం, సునీల్, జయప్రకాశ్ రెడ్డి త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు.

2007లో విడుద‌లైన ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌ను బాగా ఆక‌ట్టుకుంది. బాక్సాఫీస్ వ‌ద్ద కాసుల వ‌ర్షం కురిపించింది. ఈ సినిమా విడుద‌లైన 15 ఏళ్ల‌కు మంచు విష్ణు, శ్రీ‌ను వైట్ల `ఢీ అంటే ఢీ` అనే టైటిల్ తో సీక్వెల్ ను అనౌన్స్ చేశారు. కానీ, అది ప‌ట్టాలెక్క‌లేదు. అయితే చాలా మందికి తెలియ‌ని విష‌యం ఏంటంటే.. ఢీ సినిమాకు ఫ‌స్ట్ ఛాయిస్ మంచు విష్ణు కాదు. నిజానికి ఈ సినిమా మాస్ మ‌హారాజా ర‌వితేజ చేయాల్సింద‌ట‌.

శ్రీ‌ను వైట్ల‌ ముందుగా ర‌వితేజ‌తోనే ఈ సినిమా చెయ్యాల‌ని నిర్ణ‌యించుకున్నాడు. అయితే ఓ రోజు అనుకోకుండా శ్రీ‌ను వైట్ల ఢీ క‌థ‌ను మోహ‌న్ బాబుకు చెప్పాల్సి వ‌చ్చింది. స్టోరీ ఆయ‌న‌కు బాగా న‌చ్చ‌డంతో.. విష్ణుతో ఢీ చెయ్య‌మ‌ని ప‌ట్టుబ‌ట్టారు. ర‌వితేజ అప్ప‌టికే ఢీ మూవీకి సైన్ చేశాడని శ్రీ‌ను వైట్ల చెప్పినా కూడా మోహ‌న్ బాబు వినిపించుకోలేదు. స్వార్థంతో వెంట‌నే ర‌వితేజ‌కు ఫోన్ ఢీ క‌థ‌ను త‌న కొడుక్కి ఇచ్చేయాల‌ని అడిగార‌ట‌. ఇక మోహ‌న్ బాబు కోర‌డంతో ర‌వితేజ నో అని చెప్ప‌లేక‌పోయాడు. అలా ర‌వితేజ చెయ్యాల్సిన ఢీ మూవీని కొడుకు కోసం మోహ‌న్ బాబు లాగేసుకున్నారు.