నా గదిలో సీక్రెట్ కెమెరాలు పెట్టి ఇబ్బంది పెట్టారు.. హీరోయిన్ కృతికర్బంద హాట్ కామెంట్స్..!!

ఢిల్లీ బ్యూటీగా పేరుపొందిన హీరోయిన్ కృతికర్బంద టాలీవుడ్లో మొదటిసారిగా భోణి సినిమాతో తన కెరీయర్ని ప్రారంభించింది. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ తెలుగుతోపాటు కన్నడ ఇండస్ట్రీలో కూడా పలు సినిమాలలో నటించింది. ఆ తర్వాత బాలీవుడ్లో అడుగుపెట్టి అక్కడే సెటిల్ అయిపోయింది. సోషల్ మీడియాలో కూడా నిరంతరం యాక్టివ్ గా ఉంటున్న ఈ ముద్దుగుమ్మ పవన్ కళ్యాణ్ తో కలిసి తీన్ మార్ సినిమాలో కూడా నటించింది. ఆ తర్వాత మిస్టర్ నూకయ్య, ఒంగోలు గిత్త తదితర చిత్రాలలో కూడా నటించింది ఈ ముద్దుగుమ్మ.

Kriti Kharbanda says she found a hidden camera in her hotel room once:  'It's scary…' | Bollywood News - The Indian Express

ప్రస్తుతం సౌత్ సినిమాలకు దూరంగా ఉంటున్నప్పటికీ బాలీవుడ్ లో మాత్రం రెండేళ్లుగా ఎలాంటి సినిమాలలో నటించలేదు.. తెలుగు హిందీలో కంటే ఈ ముద్దుగుమ్మ కన్నడలోనే పలు చిత్రాలలో నటిస్తోంది.తన నటనతో ఆడియన్స్ ను ఫిదా చేసిన కృతీకర్బంధ సోషల్ మీడియాలో తరచు యాక్టివ్గా ఉంటూ తన గ్లామర్ తో కుర్రకారులను మెస్మరైజ్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు ఎదురైన చేదు అనుభవం గురించి తెలియజేసింది.

తను కనడ ఇండస్ట్రీలో ఒక సినిమా షూటింగ్ చేస్తున్న సమయంలో ఒక హోటల్లో బస చేసేందుకు తనకి ఒక రూమ్ ఇచ్చారని అయితే ఆ రూమ్ లో సీక్రెట్ గా కెమెరాలు పెట్టారని స్టేట్ చేసే సమయంలో రూముని చెక్ చేసుకోవడం తనకు తన టీంకు అలవాటు అని తెలియజేసింది.. అలా గది మొత్తం పరిశీలించగా సెటప్ బాక్స్ వెనకాల ఒక కెమెరాను గుర్తించాము.. అది చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాము.. అప్పటినుంచి ఎక్కడైనా బస చేయాలంటే చాలా జాగ్రత్తగా ఉంటామని తెలిపింది. ఇది తెలిసి చాలా బాధపడ్డాను అని తెలిపింది కృతి కార్బంద.