మ‌హేష్‌బాబు మొబైల్ రింగ్ టోన్ తెలుసా… ఇంత‌క‌న్నా షాకింగ్ ఉండ‌దు..!

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ డైరెక్షన్లో రూపొందుతున్న ‘ గుంటూరు కారం ‘ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. కాగా మహేష్ బిగ్‌సి బ్రాండ్ కి అంబాసిడర్ గా కూడా వ్యవహరిస్తున్నాడు. బిగ్‌సి 20 ఇయర్స్ కంప్లీట్ అయిన సందర్భంగ 20 ఏళ్ల యానివర్సరీ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.

ఈ కార్యక్రమంలో మహేష్ బాబు హాజరయ్యాడు. ఇందులో భాగంగా మీడియా ప్రతినిధులతో చర్చించిన మహేష్ బాబు వారు అడిగే ప్రశ్నలకు ఎంతో ఆసక్తికరంగా సమాధానాలు చెప్పాడు. వ్యక్తిగత వృత్తిపర విషయాలను కూడా ఆయన పంచుకున్నాడు. ఈ నేపథ్యంలో రిపోర్టర్ మీ మొబైల్ రింగ్టోన్ ఏంటి అని అడగగా షాకింగ్ సమాధానం చెప్పాడు. ‘ సైలెంట్ ‘ అని బదులిచ్చాడు.

నా ఫోన్ ఎప్పుడు సైలెంట్ లో ఉంటుంది సినిమా షూటింగ్ పనుల్లో బిజీగా ఉంటాను కాబట్టి సైలెంట్ లోనే ఉంచుతాను అని సూపర్ స్టార్ చెప్పుకొచ్చాడు. అయితే మహేష్ బాబు సమాధానాలు ఎవరు ఊహించిన విధంగానే ఉంటాయన సంగతి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం మహేష్ బాబు ఇచ్చిన ఈ షాకింగ్ ఆన్సర్స్‌ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.