చిరంజీవి కెరీర్ని నిలబెట్టిన చిత్రాలు ఇవే..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి ప్రాణం ఖరీదు సినిమాతో నటుడుగా పరిచయమయ్యారు.. ఈ సినిమా తరువాత ఎన్నో చిత్రాలలో నటుడుగా విలన్ గా కూడా నటించారు. అలా ఎన్నో చిత్రాలలో నటించి చిరంజీవి నుంచి మెగాస్టార్ గా ఎదిగి ఎంతోమంది అభిమానులను సంపాదించారు.. ఈరోజు చిరంజీవి 68వ బర్తడే సందర్భంగా చిరంజీవి గురించి పలు విషయాలు వైరల్ గా మారుతున్నాయి. చిరంజీవి కెరియర్ లోనే తన స్టార్ డమ్ ను నిలబెట్టిన చిత్రాల గురించి ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.

Mega 156' announced on Chiranjeevi's special day, igniting fan frenzy |  Telugu Movie News - Times of India

ఖైదీ సినిమాకు ముందు వరకు చిరంజీవి ఒక సాధారణ హీరోగా ఉండేవారు.. ఈ సినిమా విడుదలైనప్పటి నుంచి చిరంజీవి కెరియర్ ఒక్కసారిగా మలుపు తిరిగింది. ఈ సినిమాతో హాలీవుడ్ రేంజ్ లో తన పాపులారిటీ సంపాదించుకున్నారు.

Chiranjeevi Birthday Special : How did Chiranjeevi get the title of Megastar..?  Do you know who gave it?

డైరెక్టర్ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన పసివాడు ప్రాణం సినిమా హాలీవుడ్ చిత్రాన్ని ఇన్స్పైర్గా తీసుకొని తెరకెక్కించారు. ఈ సినిమా క్లాస్ మాస్ అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ చిత్రంలో చిరంజీవి డ్యాన్స్ నటన అద్భుతంగా ఉన్నాయి. ఈ సినిమాతో అభిమానుల సంఖ్య పెరిగింది.

చిరంజీవి కెరియర్లు మరో వైవిధ్యమైన చిత్రం స్వయంకృషి.. చెప్పులు కుట్టే స్థాయి నుంచి ఒక వ్యాపారిగా ఎలా ఎదిగారు అని కథాంశంతో తెరకెక్కించారు. ఈ సినిమా వైవిధ్యమైన కథాంశంతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.నటుడుగా ఒక స్థాయిలో చిరంజీవిని నిలబెట్టిన సినిమా ఇది.

జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాని రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. ఈ సినిమా కథనంతో ఆడియన్స్ ని ఎంటర్టైన్మెంట్ చేయడమే కాకుండా ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించిందని చెప్పవచ్చు చిరంజీవి కెరీర్ లోనే బ్లాక్బస్టర్ ఇండస్ట్రీ హిట్టుగా నిలిచింది.

విజయబాపినీడు దర్శకత్వంలో వచ్చిన గ్యాంగ్ లీడర్ సినిమా మాస్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. చిరంజీవి డాన్స్ ఫైట్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. చిరంజీవిలోని ఒక కొత్త స్టైల్ ని ఈ సినిమాలో చూపించారు.

గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన విభిన్నమైన కథాంశ చిత్రం చూడాలని ఉంది.. ఈ సినిమా పాటలు సూపర్ హిట్టుగా నిలుచాయి.

బి గోపాల్ దర్శకత్వంలో వచ్చిన ఇంద్ర సినిమా చిరంజీవి ఫ్యాషన్ బ్యాక్ గ్రౌండ్లో నటించారు అప్పటివరకు ఇలాంటి జోనర్ ని టచ్ చేయని చిరంజీవి ఒక డిఫరెంట్ కద అంశంతో వచ్చి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడమే కాకుండా ఇండస్ట్రీ రికార్డులను తిరగరాశారు.

చిరంజీవి కెరియర్ లోనే ఒక మైల్ స్టోన్గా నిలిచిపోయిన చిత్రం ఠాగూర్.. ఈ చిత్రాన్ని డైరెక్టర్ వివి వినాయక్ రూపొందించారు.

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ లో నటించిన చిత్రం ఖైదీ నెంబర్ 150.. ఈ సినిమాతో చిరంజీవి కం బ్యాక్ ఇచ్చారు.