శ్రీలీల చేసిన ప‌నికి త‌లలు ప‌ట్టుకుంటోన్న టాలీవుడ్ టాప్ ప‌ర్స‌న్స్‌..!

యంగ్ బ్యూటీ శ్రీ లీల గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన “పెళ్లి సందడి”సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే స్టార్ హోదా అందుకుంది. వరుస ఆఫర్లు ఈ ముద్దుగుమ్మ చేతిలో ఉన్నాయి. దీంతో టాలీవుడ్ లో స్టార్ హీరోలు సైతం శ్రీ లీలనే మొదట సెలెక్ట్ చేసుకుంటున్నారు.

అంతకంతకు డిమాండ్ పెరుగుతుంటే ఈ బ్యూటీ రెమ్యూనిరేషన్ కూడా బాగా డిమాండ్ చేస్తుంది. ఇక ఈమె ఎంత డిమాండ్ చేస్తున్నా నిర్మాతలు కూడా శ్రీ లీలాకే ప్రయారిటీ ఇస్తున్నారు. ఇదిలా ఉంటే ప్ర‌స్తుతం శ్రీ లీల సినిమాలకు బ్రేక్ ఇవ్వనన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి . దీనికి కారణం.. శ్రీ లీలా చదువుకుంటూనే సినిమాల్లో రాణిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈమె MBBS లాస్ట్ ఇయర్ చదువుతోంది. ఈ సంవత్సరంతో తన డిగ్రీని పూర్తి చేస్తుంది.

అయితే వరుస సినిమాలతో బిజీగా ఉన్న శ్రీ లీలకు నవంబర్, డిసెంబర్ నెలలో పరీక్షలు ఉన్నాయట. అందుకే ఈ రెండు నెలల పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చి ఎక్జామ్స్ పై శ్ర‌ద్ధ పుట్టాల‌ని నిర్ణయించుకుందట. మరి ఈ విషయం ఎంతవరకు నిజమో తెలియదు కానీ నిర్మాతలు మాత్రం టెన్షన్తో తలలు పట్టుకుంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.