ఎన్ని లక్షల కోట్లు ఇచ్చిన నీ కొడుకుతో మాత్రం సినిమా తీయను… ఆ స్టార్ హీరో మొహం మీదే చెప్పేసిన రాజ‌మౌళి…!

తెలుగు చిత్ర పరిశ్రమ స్థాయిని ప్రపంచ సినిమాల దృష్టికి తీసుకువెళ్లిన నేటి తరం దర్శకులలో దర్శక దీరుడు రాజమౌళి ముందు వరుసలో ఉంటారు. ఎన్టీఆర్ హీరోగా వచ్చిన స్టూడెంట్ నెంబర్ 1న్ సినిమాతో దర్శకుడుగా తన కెరీర్‌ను మొదలుపెట్టి ఇప్పటివరకు 12 సినిమాలుకు పైగా తెరకెక్కించిన రాజమౌళి ప్రతి సినిమాను తెలుగు సినిమా స్థాయిని పెంచే విధంగా తన దర్శకత్వ ప్రతిభను చూపిస్తూ భారతదేశంలోని అగ్ర దర్శకులుగా గుర్తింపు తెచ్చుకున్నాడు.

ప్రభాస్ హీరోగా వచ్చిన బాహుబలి సినిమాలతో రాజమౌళి తెలుగు సినిమా స్థానిక గ్లోబల్ స్థాయికిి తీసుకువెళ్లాడు. ఈ సినిమాలు తర్వాత వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమాతో ఏకంగా తెలుగు సినిమాకు ఆస్కార్ అవార్డును అందించాడు. ప్రస్తుతం తన తర్వాత సినిమాను సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. అలాంటి ఈ దర్శక ధీరుడు రాజమౌళి ఆయన కెరీర్లో ఓ స్టార్ హీరో కొడుకుతో ఎన్ని లక్షల కోట్లు ఇచ్చినా సరే సినిమా చేను అంటే చేయనని తేగేసి చెప్పారట. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరు? ఆ స్టార్ హీరో కోడుకు ఎవరో ఇప్పుడు చూద్దాం.

ఇప్పటికే భారత దేశంలో ఉన్న ఎందరో స్టార్‌ హీరోలు రాజమౌళితో సినిమా చేయాలని కలలు కంటున్నారు. రాజమౌళి తనకి ఇష్టమైన హీరోలతోనే సినిమాలు చేసుకుంటూ వస్తున్నాడు. అలా రాజమౌళి డైరెక్షన్లో తన తన కొడుకుతో సినిమా చేయాలని టాలీవుడ్ లోనే స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న కింగ్ నాగార్జున గతంలో ఎన్నో ప్రయత్నాలు చేశాడట. అదేవిధంగా తన చిన్న కొడుకు అఖిల్ తో సినిమా చేయాలని రాజమౌళిని ఎంతో బతిమిలాడుట. రాజమౌళి కూడా సినిమా చేయడానికి సరే అన్నాకానీ ఆ తర్వాత అఖిల్ నటించిన వరుస సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో ఎలాగైనా సరే తన కొడుకు తర్వాత సినిమా హిట్ అవ్వాలని ఉద్దేశంతో రాజమౌళి దగ్గరికి వెళ్లి అఖిల్‌తో సినిమా చేస్తా అన్నారు ఏమైందని అడిగితే వామ్మో ఎన్ని కోట్లు ఇచ్చినా సరే నీ కొడుకు అఖిలతో మాత్రం సినిమా చేయనని నాగార్జున మొహం మీదే చెప్పేశాడట. అదేవిధంగా అఖిల్‌తో సినిమా చేయ‌న‌ని చెప్పడానికి ప్రధాన కారణం ఆయన చేసిన మూడు సినిమాలు వరుసగా ప్లాప్‌ అయ్యాయి. ఆ కారణంతోనే రాజమౌళి తన డైరెక్షన్లో అఖిల్‌తో సినిమా చేయనని చెప్పారంటూ ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందులో ఎంతవరకు నిజముందో నాగార్జున- రాజమౌళికే తెలియాలి.