హీరోగా ఆర్యన్ రాజేష్ కెరీర్ ఫెయిల్ అవ్వడానికి కారణం అదేనా..?

2002లో హాయ్ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టాడు ఆర్యన్ రాజేష్. ప్రముఖ దర్శకుడు ఈవివి సత్యనారాయణ సినీ వారసుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన ఆర్యన్ రాజేష్ మొదటి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తర్వాత వరుస సినిమాల్లో నటించి సక్సెస్ సాధించిన రాజేష్ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కొంత కాలానికి ఆయన నటించిన సినిమాలన్నీ వరుసగా ప్లాప్‌లు కావడంతో ఇండస్ట్రీకి దూరమయ్యాడు.

ఇలా కొంతకాలం ఇండస్ట్రీకి దూరమైన రాజేష్ మళ్లీ వినయ విధేయ రామ సినిమాతో రామ్ చరణ్ అన్నగా రీఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా కూడా సక్సెస్ సాధించలేకపోయింది. దీంతో అవకాశాలు రాలేదట. రాజేష్‌కి తన తండ్రి ఈవివి సత్యనారాయణ బ్రతికి ఉన్నంతకాలం వరుస సక్సెస్‌లు వరించాయి. ఆయన మరణానంతరం రాజేష్ హీరోగా కొనసాగలేకపోయాడు.

ఆయన నటించిన అన్ని సినిమాలు ఫ్లాప్స్ గా నిలిచాయి. తన తండ్రి బతికి ఉన్న టైంలో రాజేష్ కథలను ఎంచుకునే విషయంలో తండ్రి కీరల్ ప్లే చేసే వారట‌. తండ్రి మరణించిన తర్వాత కథల ఎంపిక విషయంలో రాజేష్ ఫెయిల్ అయ్యాడట‌.. దీంతో ఆయన వరుస ఫ్లాప్‌లను చెవి చూడాల్సి వచ్చిందట. హీరోగా వ‌రుస ఫ్లాప్‌ల‌ను ఎదుర్కొన్న ఆర్యన్ రాజేష్ ప్రస్తుతం ప్రొడక్షన్ రంగం వైపు అడుగులు వేస్తున్నట్లు సమాచారం.