అత్యుత్సాహంతో మీద‌కు దూసుకొచ్చిన అభిమాని.. త‌మ‌న్నా చేసిన ప‌నికి అంతా షాక్!(వైర‌ల్ వీడియో)

మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా ప్ర‌స్తుతం చాలా బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ వారంలో ఒక్క రోజు వ్య‌వ‌ధితో ఆమె నుంచి రెండు సినిమాలు రాబోతున్నాయి. అందులో ర‌జ‌నీకాంత్ `జైల‌ర్‌` ఒక‌టి కాగా.. మ‌రొక‌టి చిరంజీవి `భోళా శంక‌ర్`. దీంతో ఈ రెండు ప్ర‌మోష‌న్స్ లోనూ త‌మ‌న్నా పాల్గొంటోంది. ఇంత బిజీలో కూడా తాజాగా త‌మ‌న్నా కేరళలోని కొల్లాంలో ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్స‌వానికి హాజ‌రు అయింది.

ఈ విష‌యం తెలుసుకున్న స్థానికులు, అభిమానులు త‌మ‌న్నాను చూసేందుకు భారీ సంఖ్య‌లో అక్క‌డ‌కు చేరుకున్నారు. అయితే ప్రారంభోత్సం అనంత‌రం త‌మ‌న్నా స్టెప్స్‌ దిగి వ‌స్తుండ‌గా.. ఓ అభిమాని అత్యుత్సాహంతో ఆమె మీద‌కు దూసుకొచ్చాడు. ఫెన్సింగ్ పైనుంచి దూకి త‌మన్నా చుట్టూ ఉన్న బౌన్స‌ర్ల‌ను త‌ప్పిచుకుని ఆమె చేయి ప‌ట్టుకున్నాడు.

దీంతో అప్రమ‌త్తైన బౌన్స‌ర్లు అత‌డిని వెన‌క్కి లాగి ప‌డేశారు. అయితే ఆ టైమ్ లో త‌మ‌న్నా ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు. సాధార‌ణంగా అలాంటి స‌మ‌యంలో సెల‌బ్రెటీలు స‌హ‌నాన్ని కోల్పోతారు. కానీ, త‌మ‌న్నా మాత్రం స‌ద‌రు అభిమాని ఉత్సాహాన్ని గ‌మ‌నించిన బౌన్స‌ర్ల‌కు న‌చ్చ‌జెప్పింది. స‌ద‌రు అభిమానికి షేక్ హ్యాండ్ ఇచ్చి.. అత‌డితో సెల్ఫీ దిగింది. దాంతో అభిమానికి ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయాయి. ఇక ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైర‌ల్ గా మార‌డంతో.. త‌మ‌న్నా మంచి మ‌న‌సుపై నెటిజ‌న్లు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.