జెడి చక్రవర్తికి ఆ టాలెంట్ కూడా ఉందా.. అదేంటో తెలుసా..?

ఒకప్పుడు స్టార్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న జెడి చక్రవర్తి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఇటీవల దయా వెబ్ సిరీస్ తో రీఎంట్రీ ఇచ్చిన జెడి చక్రవర్తి ఈ వెబ్ సిరీస్ తో సూపర్ సక్సెస్ సాధించాడు. ఈ వెబ్ సిరీస్ లో విష్ణుప్రియ, ఈషా రెబ్బ, కమల్ కామరాజు తదితరులు కీరోల్‌ ప్లే చేశారు. తాజాగా ఈ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అయి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ సిరీస్ సక్సెస్ సాధించడంతో జెడి చక్రవర్తి కి సంబంధించిన కొన్ని ఆస‌క్తిక‌ర విష‌యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

జెడి చక్రవర్తి యాక్టింగ్ లోనే కాక తనకు మ్యూజిక్ లోను మంచిపట్టు ఉందట. మనీ సినిమాలో ఓ పాట పాడిన జెడి కి మంచి రాగ , గాత్ర జ్ఞానం, శృతి పాండిత్యం కూడా ఉందట. జెడి చక్రవర్తి తల్లి కొంగుచాటు బిడ్డ అతనికి ఏ ఆనందం వచ్చినా ఏ విషయమైనా ముందుగా తల్లితోనే పంచుకుంటాడట. చక్రవర్తి తల్లి.. కోవెల శాంత గొప్ప కర్ణాటక సంగీత విధ్వంసరాలు. ఆమె దగ్గరే ఖాళీగా ఉన్న సమయంలో సంగీతం మెలుకువ‌లు నేర్చుకున్నాడు జెడి. అలానే జెడికి ఎవరికి పాదాభివందనం చేయడం ఇష్టం ఉండదట.

దీన్ని బట్టి చాలామంది జెడి చక్రవర్తికి గర్వం అనుకుంటారేమో అయితే జెడి మాత్రం అనుకుంటే అనుకోనివ్వండండి నా దృష్టిలో నేను పాదాభివందనం చేయడానికి ఇష్టపడేది ఇద్దరే ఇద్దరు వ్యక్తులకి ఒకరు నాకు జన్మనిచ్చిన తల్లి. రెండో వారు నాకు సినీ రంగంలో జన్మనిచ్చిన తండ్రి లాంటి వ్యక్తి రామ్‌గోపాల్ వర్మ గారు అని చక్రవర్తి చెబుతాడు. ఈయన యాక్టింగ్ తర్వాత ప్రొడక్షన్ రంగంలోకి అడుగు పెట్టి సత్య సినిమా హిట్ కావ‌డంతో జెడి చక్రవర్తిని అప్ప‌టినుంచి చాలామంది సత్య అనే పిలుస్తున్నారు.