ఆ స్టార్ హీరో మూవీతో కోలీవుడ్ ఎంట్రీకి సిద్ధ‌మైన మృణాల్‌.. హాట్ టాపిక్ గా రెమ్యున‌రేష‌న్‌!

సీతారామం మూవీతో ఓవ‌ర్ నైట్ గా గుర్తింపు సంపాదించుకున్న బాలీవుడ్ ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్‌.. ప్ర‌స్తుతం టాలీవుడ్ లో బిజీ బ్యూటీగా మారిపోయింది. చేతి నిండా సినిమాల‌తో దూసుకుపోతోంది. ఇప్ప‌టికే న్యాచుర‌ల్ స్టార్‌ నానికి జోడీగా `హాయ్ నాన్న` మూవీలో న‌టిస్తోంది. అలాగే విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో ఓ మూవీకి క‌మిట్ అయింది. మ‌రోవైపు రామ్ చ‌ర‌ణ్‌, బుచ్చిబాబు కాంబోలో తెర‌కెక్కబోతున్న `ఆర్సీ 16`లోనూ మృణాల్ ను హీరోయిన్ గా ఎంపిక చేశార‌ని ఇన్‌సైడ్ టాక్ న‌డుస్తోంది.

ఈ సంగ‌తి ప‌క్క‌న పెడితే.. మృణాల్ క‌న్ను ఇప్పుడు కోలీవుడ్ పైన కూడా ప‌డింది. త్వ‌ర‌లోనే ఓ స్టార్ హీరో మూవీతో త‌మిళంలోకి అడుగు పెట్ట‌బోతోంది. టాలెంటెడ్ హీరో శివ కార్తికేయన్‌, ప్ర‌ముఖ దిగ్గజ ద‌ర్శ‌కుడు ఏఆర్ మురుగ‌దాస్ కాంబినేష‌న్ లో ఓ సినిమా ప‌ట్టాలెక్క‌బోతోంది. లైకా ప్రొడెక్ష‌న్స్ బ్యాన‌ర్ పై భారీ బ‌డ్జెట్ తో ఈ మూవీని నిర్మించ‌బోతున్నారు.

అనిరుధ్ సంగీతం అందించ‌బోతున్నాడు. అయితే ఈ చిత్రంలో శివ కార్తికేయ‌న్ కు జోడీగా మృణాల్ ఠాకూర్ ను ఎంపిక చేశార‌ట‌. ఇప్ప‌టికే సంప్ర‌దింపులు సైతం పూర్తి అయ్యాయ‌ట‌. ఏడాది చివ‌ర్లో ఈ సినిమా స్టార్ట్ కాబోతోంది. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడెక్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. అయితే ఈ సినిమాకు మృణాల్ పుచ్చుకుంటున్న రెమ్యున‌రేష‌న్ హాట్ టాపిక్ గా మారింది. త‌మిళంలో డెబ్యూ మూవీ అయినా కూడా మృణాల్ ఏకంగా రూ. 4 కోట్ల రేంజ్ లో రెమ్యున‌రేష‌న్ ఛార్జ్ చేస్తుంద‌ని ఇన్‌సైడ్ టాక్.