వస్తువులు ఎక్కడ పెట్టారో మర్చిపోతున్నారా.. జ్ఞాపకశక్తి తగ్గ‌డానికి కార‌ణాలు ఇవే.. !!

దాచిన వస్తువులు ఎక్కడ ఉన్నాయో గుర్తు రాకపోవడం.. ఆఫీసుకు ఆలస్యం అవుతుందని భయంతో బైక్ కీస్‌ను మర్చిపోయి పరుగులు పెట్టడం. స్కూల్ కి టైమ్‌ అవుతుందని హడావిడిలో అమ్మ చేసిన లంచ్ బాక్స్ మర్చిపోవడం. ఇలా చాలా మంది చాలా వస్తువులు మర్చిపోతూ ఉంటారు. ఒకప్పుడు ఈ వ్యాధి పెద్దవారిలో మాత్రమే ఏర్పడేది. కానీ ఇప్పుడు 16 ఏళ్ల వయసులోని ఈ వ్యాధి ఏర్పడుతుంది. పోషకాహార లోపం, కొన్ని రకాల రోగాలు కూడా మతిమరుపుకి దారితీస్తున్నాయని మానసిక వైద్యలు చెబుతున్నారు.

అలాగే ఈ వ్యాధి 25 ఏళ్ల నుంచి 35 ఏళ్ల వయసు వారిలో అధికంగా ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. కొందరు ఏదో సమస్యతో తమ వద్దకు వచ్చినప్పుడు వాళ్లు మతిమరుపుతో బాధపడుతున్నట్లు గుర్తించగలుగుతున్నామని వైద్య నిపుణులు అంటున్నారు. 20 నుంచి 30 శాతం మంది యువత ఇలా ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. చేసే పనిలో టెన్షన్‌, యాంగ్జయిటీ, మానసిక అంశాలు జ్ఞాపక శక్తిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. దీంతో గుర్తుకు రాని విషయం కోసం యువత సతమతమవుతోంది. తీరా సమయానికి అది గుర్తుకు రాదు. అంతలా మెదడు పట్టుతప్పుతోంది.

డయాబెటిస్‌, బీపీ, థైరాయిడ్‌ వంటివి సోకి ఐదేళ్లు దాటిన వారిలో మతిమరుపుకు దారితీసే అవకాశాలు ఉన్నాయి. ఈ వ్యాధులు ఉన్న వారిలో హార్మోన్ల అభివృద్ధిలో లోపాలు చోటుచేసుకుంటా యని వైద్యులు చెపుతున్నారు. ఆనందంగా ఉండకుండా, మానసికంగా మందకొడిగా ఉండటంతో జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది. జ్ఞాపకశక్తి పెరగడానికి విటమిన్‌ బీ 12 కారణమని, దాని లోపంతో సమస్య ఎదురవుతుంది.పౌష్టికాహారం లేక పోవడంతో బ్రెయిన్‌ సెల్స్‌ అభివృద్ధి జరగడం లేదని చెబుతున్నారు.

రెడీమేడ్‌ ఫుడ్‌ జోలికి వెళ్లకూడదని సూచిస్తున్నారు. బీ 12 నాన్‌ వెజ్‌లో అధికంగా, పుష్కలంగా లభిస్తుందని, ఆకుకూరలు తింటే జ్ఞాపకశక్తి పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. మతిమరుపు కు ప్రధాన కారణం ఒత్తిడి… యాంగ్జయిటీ, ఆల్కహాల్, మత్తు పదార్థా లకు అలవాటు పడిన వారిలో మతిమరుపు సమస్య ఎదురవుతుంది. ఒత్తిడిని జయించేందుకు ప్రతి ఒక్కరు బ్రెయిన్‌ను ఎక్సర్‌సైజ్‌ చేయించాలి. అంటే ఎక్కువగా లెక్కలు కట్టడం, ఫోన్‌ నంబర్లు గుర్తు పెట్టుకోవడం వంటివి చేస్తూ ఉండాలి. అప్పుడు మతి మరుపు తగ్గే అవకాశం ఉంటుంది.