నేహా శెట్టి.. ఈ మధ్య టాలీవుడ్ లో బాగా వినిపిస్తున్న పేరు. మంగళూరులో పుట్టి బెంగళూరులో పెరిగిన నేహా శెట్టి.. మెహబూబా మూవీతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఆ తర్వాత గల్లీ రౌడీ, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రాల్లో మెరిసింది. కానీ, ఇవేమి ఆమె కెరీర్ కు ఉపయోగపడలేదు. అయితే గత ఏడాది విడుదలైన `డిజే టిల్లు` మూవీతో నేహా శెట్టి గుర్తింపు సంపాదించుకుంది.
యూత్ లో మంచి ఫాలో పెంచుకుంది. యంగ్ హీరోలకు మోస్ట్ వాంటెడ్ బ్యూటీగా మారింది. రీసెంట్ గా బెదురులంక 2012 సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. కార్తికేయ ఇందులో హీరోగా నటించారు. ఈ మూవీ మిక్స్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ.. నేహా శెట్టికి మాత్రం మంచి మార్కులు పడ్డాయి. మరోవైపు ఈ అమ్మడు కిరణ్ అబ్బవరంకు జోడీగా `రూల్స్ రంజన్`, మాస్ కా దాస్ విశ్వక్ సేన్ సరసన `గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి` చిత్రాల్లో నటించింది.
త్వరలోనే ఈ రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఇప్పటికే ఈ చిత్రాల నుంచి విడుదలైన ‘సమ్మోహనుడా’, ‘సుట్టంలా సూసి పోకలా’ సాంగ్స్ తో యమా పాపులర్ అయ్యాయి. ఇకపోతే నేహా శెట్టి లేటెస్ట్ ఫోటోషూట్ ఇప్పుడు నెట్టింట కాకరేపుతోంది. ట్రాన్స్ ఫరెంట్ చీర కట్టుకుని అందంగా ముస్తాబైన నేహా.. స్టన్నింగ్ స్ట్రక్చర్ తో టెంప్టింగ్ గా ఫోటోలకు ఫోజులిచ్చింది. చీర చాటున దాగనంటున్న అందాలను చూపిస్తూ కాకరేపింది. కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టించింది. మరి లేటెందుకు వాటిపై మీరు ఓ లుక్కేసేయండి.
View this post on Instagram