బైక్ పై సింగిల్ గా షికారుకు వచ్చిన సింహం.. తీరా దగ్గరికి వెళ్లి చూస్తే..!!

ఇంటర్నెట్ వరల్డ్ చాలా పెద్దది. ప్రపంచం నలుమూలల ఎలాంటి చిత్ర, విచిత్ర విషయాలు ఏమి జరిగినా.. క్షణంలో సోషల్ మీడియాలో దర్శనమిస్తాయి. ఫన్నీ వీడియోలు పక్కనపెడితే.. వైల్డ్ లైఫ్ కు సంబంధించిన వీడియోలు తెగ చెక్కర్లు కొడతాయి. పిల్లి, చిలుక, కుక్క తో పాటు కొందరు ప్రమాదమైన జంతువుల్ని సైతం పెంపుడు జంతువులుగా పెంచుకుంటారు. ఇక అందుకు సంబంధించిన వీడియోలను కూడా నెటిజెన్లు బాగానే వీక్షిస్తారు.

మీరెప్పుడైనా కృర జంతువులు సింహం, పులి రోడ్డుపైకి రావడం చూశారా? తాజాగా ఓ వీధిలోకి సింగిల్ గా బైక్ పై షికారుకొచ్చింది. అడవికి రారాజు సింహం… దాన్ని చూడగానే షాక్ అవుతారు స్థానికులు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే? ఆ సింహాన్ని దగ్గరకు వెళ్లి చూడగా? ఈ వీడియోను అనే హ్యాండిల్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. ఓ వీధిలో పార్క్ చేసి ఉన్న బైక్ పై ఒక జంతువు కూర్చుంది. దాన్ని మీరు వెనుక నుంచి చూడవచ్చు. ఇక వెనుక నుంచి ఆ జంతువును చూసి అందరూ అది సింహం అని అనుకున్నారు.

దానికున్న చర్మం రంగు, భారీ జుట్టు చూసి ఎవరైనా కూడా అడవికి రాజు అయిన సింహం షికారు కొచ్చిందని అనుకుంటారు. ఇక అటుగా కారులో వెళ్తున్న కొందరు ఆ జంతువును వెనుక నుంచి తమ మొబైల్ ఫోన్స్ తో వీడియో తీయడం ప్రారంభించారు. కెమెరా ముందుకు కదులుతూ పోగా.. అసలు విషయం తెలుస్తుంది. అది సింహం కాదు.. కుక్క అని కన్ఫర్మ్ అవుతుంది. ఇంతకి అసలు సంగతేమిటంటే.. ఒక వ్యక్తి తన పెంపుడు కుక్కకు సింహం లాంటి వేషధారణ కట్టాడు.