స్టార్ యాక్టర్ వరలక్ష్మి శరత్ కుమార్ కు “ఎన్ఐఏ” బిగ్ షాక్… విచారణకు రమ్మని నోటీస్…!!

హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. బాలయ్య హీరోగా వచ్చిన వీర సింహారెడ్డి చిత్రంలో.. బాలయ్యకి చెల్లిగా నటించి అందరిని మెప్పించింది. తాజాగా డ్రగ్స్ కేసులో ఈ అమ్మడి గురించి సోషల్ మీడియాలో నెట్టింటి వైరల్ గా మారింది.

 

స్టార్ యాక్టర్ వరలక్ష్మి కి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) బిగ్ షాకిచ్చింది. డ్రగ్స్ కేసులో విచారణకు హాజరు కావాలంటూ నటికీ ఎన్ఐఏ సమన్లు జారీ చేసింది. కాగా గతంలో నటి వరలక్ష్మి శరత్ కుమార్ వద్ద పీఏగా పనిచేసిన ఆదిలింగం కేరళలో పట్టుబడిన డ్రగ్స్ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు.

డ్రగ్స్ సరఫరా ద్వారా వచ్చిన డబ్బులను అదిలింగం సినిమాల్లో ప్రొడ్యూస్ చేస్తున్నట్లు ఎన్ఐఏ గుర్తించింది. ఇప్పటికే అదిలింగాన్ని విచారించిన ఎన్ఐఏ.. తాజాగా ఈ కేసులో విచారణకు హాజరు కావాలని నటి శరత్ కుమార్‌కు సమన్లు జారీ చేసింది. డ్రగ్స్ కేసులో నటి శరత్ కుమార్ కు ఎన్ఐఏ నోటీసులు ఇవ్వడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.