స్కంద స్టోరీని ఆ స్టార్ హీరో రిజెక్ట్ చేస్తేనే రామ్ హీరోగా చేస్తున్నాడా.. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరంటే..!?

యాక్షన్ సినిమాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో యంగ్ హీరో రామ్ నటిస్తున్న తాజా మూవీ స్కంద.. తాజాగానే ఈ సినిమా ట్రైలర్ కూడా ప్రేక్షకుల ముందుకు వ‌చ్చి సినిమాపై అంచనాలను పెంచేసింది. అదేవిధంగా అందరూ ఈ సినిమా గురించి మాట్లాడే విధంగా చేసుకుంది. అయితే ఇక్కడ మరో ఇంటరెస్టింగ్ విషయం ఏమిటంటే.. ఈ సినిమాను మొదట ఓ హీరో దగ్గరికి వెళ్ళింది.. ఆయన ఎందుకు వద్దన్నారు.. ఏంటి ఆ కథ అనేది ఇక్కడ తెలుసుకుందాం.

 

సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న వార్తల ప్రకారం స్కంద కథ ముందుగా బోయపాటి మహేష్ బాబు కోసం రాసుకున్నారట. ఆయనకు స్టోరీ కూడా చెప్పారట.. అయితే మహేష్ మొదట కథ విన్నప్పుడే నో చెప్పేసారని తెలుస్తుంది. స్టోరీలో మార్పులు చేసిన కూడా తన బాడీ లాంగ్వేజ్ తన ఇమేజ్‌కు అంతగా ఈ ఊర‌ మాస్ కథ‌ వర్కౌట్ కాదని తేల్చి చెప్పారని సమాచారం. తర్వాత మహేష్ ల సాఫ్ట్ ఇమేజ్ ఉన్న హీరో ఎవరు అంటే రామ్ గుర్తుకు వచ్చి అతనిని కలిసి కథ చెప్పడం జరిగిందని అంటున్నారు.

ఈ సినిమా కూడా మిర్చి సినిమా టైప్ లో ఫస్ట్ ఆఫ్ మొత్తం ఎంతో సాఫ్ట్ గావెళ్తుంది. సెకండ్ ఆఫ్ మాత్రం మాస్ యాక్షన్ ఓరియెంటెడ్ గా ఉంటుందని అంటున్నారు. అయితే అప్పుడు మహేష్ తీసుకున్న నిర్ణయం కరెక్టా కాదా అన్నది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. అయితే ఇక్కడ చాలామంది స్కంద ఎంత పెద్ద హిట్ అయినా అలాంటి క‌థ‌ మహేష్ కు సూటు కాదు కాబట్టి ఆయన డెసిషన్ 100% కరెక్ట్ అని అంటున్నారు.

రవితేజ హీరోగా వచ్చిన భద్రా సినిమాతో ద‌ర్శ‌కుడిగా కెరీర్ మొదలు పెట్టిన బోయపాటి, బాలయ్యతో వ‌రుస‌గా మూడు సినిమాలు చేసి హ్యాట్రిక్ విజయాలు అందుకున్నాడు. ఇక ఆయన దర్శకత్వంలో చివరగా వచ్చిన ఆఖండా సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బాలయ్య ద్విపాత్రాభినయం చేసిన ఈ మూవీ ఆయన కెరీర్ లోని వన్ అఫ్ ది బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. ఇక సినిమా తర్వాత యంగ్ హీరో రామ్‌తో కలిసి స్కందా టైటిల్ తో సినిమా చేశారు బోయపాటి.

ఈ సినిమా కూడా మాస్ ఎంటర్టైనర్ గా రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. వీటన్నిటికీ తోడు ప్రస్తుత టాలీవుడ్ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్గా నటిస్తుంది. ఈ సినిమాలో రామ్ అదిరిపోయే మాస్ అవతారంలో గుబురు గడ్డంతో కొత్త లుక్ లో కనిపించనున్నాడు. మీరు దిగితే ఊడేదుండదు లేదు.. నేను దిగితే మిగిలేదుండదు అని గ్లింప్స్ లో డైలాగ్ ఆకట్టుకుంది. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. సెప్టెంబర్ 15న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.