ఉదయం లేవగానే టీ తాగుతున్నారా.. అయితే డేంజర్ జోన్ లో ఉన్నట్లే..!!

టీ లేకుండా ఇక లేమురా అన్నట్లుగానే ఉంటారు కొందరు. ఉదయం లేవగానే టీ తాగుతారు. దీనిని బెడ్ కాఫీ/టి అని అంటారు. చెప్పుకోవడానికి ఈ పేరు బాగుంది కానీ, ఆరోగ్య పరంలో చూస్తే మాత్రం ఎనలేని అపాయం కలిగిస్తుంది. అవును, ఇది మేం అంటున్న మాట కాదు.. ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఉదయం పూట టీ ని ఎనర్జీ డ్రింక్‌గా లేదా ఒక కప్పు వేడి టీతో సేమించే వారిలో మీరు ఒకరు అయితే, ఈ వార్త మీకోసమే.. ఉదయం టీ తాగడం వల్ల ఆరోగ్యం పై ఎంత చెడు ప్రభావం చూపిస్తుందో తెలుసా?

ఉదయం ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల కడుపులోని ఆమ్ల, అల్కలీన్ పదార్థాల అసమతుల్యత కారణంగా జీవక్రియ వ్యవస్థకు అంతరాయం ఏర్పడుతుంది. ఆదనంగా, మిల్క్ టి కడుపులో ఆమ్లాన్ని పెంచడం ద్వారా జీర్ణ వ్యవస్థపై చెడు ప్రభావాన్ని చూపిస్తుంది. ఇది బరువు పెరగడానికి ప్రధాన కారణాల్లో ఒకటి. ఉదయాన్నే లేచిన వెంటనే స్ట్రాంగ్ అండ్ హార్ట్ టీ తాగడానికి ఇష్టపడతారని చాలామంది చెప్పడం మీరు వినే ఉంటారు. కానీ ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడిటీ తాగడం వల్ల పొట్టలో పలు భాగం దెబ్బతింటుంది. కాళీ కడుపుతో టీ తాగడం వల్ల శరీరంలో చక్కెర కరిగిపోతుంది.

ఫలితంగా బరువు పెరుగుట, ఉబకాయం ఏర్పడుతుంది. అలాగే ప్రతిరోజు కప్పుల కొద్ది టీ తాగడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. టీ తాగడం వల్ల తాజాదనం వస్తుందని భావిస్తారు. ఉదయాన్నే పాలతో టీ తాగడం వల్ల పనిలో అలసట, చికాకులు కలుగుతాయి. మీకు టీ అంటే ఇష్టం ఉంటే, ఎప్పుడూ వేడిగా లేదా చల్లగా ఉండే టీ ని తాగకండి. ఉదయం నిద్ర లేచిన వెంటనే టీ తాగే అలవాటు ఉంటే, కాళీ కడుపుతో టీ తాగే బదులు, దీనితో పాటు బిస్కెట్ లేదా చెరుతిండిని తీసుకోండి.