హాట్ టాపిక్ గా `మెగా` హీరోల రెమ్యున‌రేష‌న్స్‌.. ఒక్కొక్క‌రు ఎంత తీసుకుంటున్నారంటే..?

ఎలాంటి సినీ బ్యాక్‌గ్రౌండ్ లేక‌పోయినా టాలీవుడ్ లో టాప్ హీరోగా ఎదిగిన అతికొద్ది మందిలో మెగాస్టార్ చిరంజీవి ఒకడు. అయితే ఆ త‌ర్వాత ఆయ‌న స‌పోర్ట్ తో త‌మ్ముళ్లు ప‌వ‌న్ క‌ళ్యాణ్, నాగ‌బాబు వ‌చ్చారు. అలాగే మెగా ఫ్యామిలీ నుంచి రెండో తరంలో రామ్ చ‌ర‌ణ్‌, వ‌రుణ్ తేజ్‌, సాయి ధ‌ర‌మ్ తేజ్‌, వైష్ణ‌వ్ తేజ్‌, అల్లు అర్జున్ ఎంట్రీ ఇచ్చారు. నాగ‌బాబు మిన‌హా మిగిలిన వారంద‌రూ హీరోగా బాగా నిల‌దొక్కుకున్నారు.

రామ్ చ‌ర‌ణ్‌, అల్లు అర్జున్ వంటి వారు పాన్ ఇండియా స్టార్స్ గా కూడా వెలుగొందుతున్నారు. అయితే ఈ మెగా హీరోల రెమ్యున‌రేష‌న్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. రామ్ చ‌ర‌ణ్‌, అల్లు అర్జున్‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ఈ ముగ్గురు రూ. 100 కోట్ల రేంజ్ లో రెమ్యున‌రేష‌న్ తీసుకుంటూ టాప్ స్థానంలో ఉన్నారు. వీరి త‌ర్వాతి స్థానంలో ఒక్కో సినిమాకు రూ. 65 కోట్లు ఛార్జ్ చేస్తూ చిరంజీవి నిలిచారు.

ఇక నాగ‌బాబు త‌న‌యుడు మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ ఒక్కో సినిమాకు రూ. 10 నుంచి 12 కోట్ల రేంజ్ లో పారితోషికం అందుకున్నాడు. అలాగే చిరంజీవి మెన‌ల్లుడు, సుప్రీం హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్ రూ. 15 కోట్లు తీసుకుంటే.. ఆయ‌న త‌మ్ముడు పంజా వైష్ణ‌వ్ తేజ్ ఓ సినిమాకు రూ. 6 నుంచి 8 కోట్ల స్థాయిలో రెమ్యున‌రేష‌న్ పచ్చుకుంటున్నాడ‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో టాక్ న‌డుస్తోంది. కాగా, మెగా ఫ్యామిలీ నుంచి అమ్మాయిలు కూడా ఇండ‌స్ట్రీలో వైపు అడుగులు వేస్తున్నారు. ఇప్ప‌టికే నిహారిక న‌టిగా, నిర్మాత‌గా బిజీ అయింది. మ‌రోవైపు చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత సైతం నిర్మాణ రంగంలో స‌త్తా చాటేందుకు ప్ర‌య‌త్నిస్తోంది.