అతడికి సీరియస్ గా ఉంది.. బ్లడ్ కావాలి.. డింపుల్ హయాతి పోస్ట్ వైర‌ల్‌..

టాలీవుడ్ హీరోయిన్ డింపుల్ హ‌యాతి.. ఖిలాడి సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ తర్వాత గోపీచంద్ స‌ర‌సన రామబాణం సినిమాలో నటించింది. ఈ సినిమా ముందు భారీ హైప్‌తో రిలీజ్ అయినా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. డింపుల్ కూడా ఈ సినిమా ద్వారా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.

అయితే నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన హాట్ ఫోటోషూట్స్, పలు పోస్టులతో అభిమానులను ఆకట్టుకుంటుంది. తాజాగా డింపుల్ హయాతి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అతనికి బ్లడ్ కావాలి అంటూ పోస్ట్ షేర్ చేసింది. ఆమె తన ఇన్‌స్టాలో హస్కీ పేరు ఉన్న ఫ‌గ్గీ లైఫ్ తో పోరాడుతున్నాడు.. అతను ప్లేట్లెట్స్ కౌంట్ తగ్గిపోయి బాధపడుతున్నాడు.

ప్రస్తుతం ట్రస్ట్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, కర్మాన్‌ఘాట్ వద్ద ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. అతనికి బ్లడ్ కావాలి అంటూ రాసుకొచ్చింది. బ్లడ్ డొనేట్ చేసే డోనర్స్ ఈ ఫోన్ నెంబర్ కు సంప్రదించండి అంటూ ఫోన్ నెంబర్ కూడా షేర్ చేసింది. అయితే ఇంతకీ ఎవరు వ్యక్తి అనే అంశంపై సోషల్ మీడియాలో సెర్చ్ స్టార్ట్ అయింది.