పిరియాడిక్ డ్రామాతో బన్నీ, త్రివిక్రమ్ మూవీ.. ఫ్లాష్ బ్యాక్ మరో లెవెల్…..!!

పుష్ప సినిమాతో గ్లోబల్ స్థాయిలో పేరు సంపాదించుకున్నాడు అల్లు అర్జున్. ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో బిజీగా ఉన్న అల్లు అర్జున్ మరోసారి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేయ‌బోతున్నాడని టాక్ వినిపిస్తుంది. దీంతో ఆ సినిమా జానర్ గురించి ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ సపోర్ట్ తో సినీ ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెట్టాడు. చిన్న సినిమాల‌లో న‌టిస్తునే స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు.

 

ఇక సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమాతో దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యాడు.పుష్ప సినిమాలో నటన, డాన్స్, డైలాగ్ డెలివరీ కి ప్రేక్షకులు మంత్రముగ్దులు అయ్యారు. అంతేకాకుండా బన్నీ స్టైల్లో చెప్పిన “నీయవ్వ తగ్గేదేలే” అనే డైలాగ్‌ను ఇండియాలోనే కాకుండా విదేశాలు సైతం రీక్రియేట్ చేశారు. ఎంతోమంది అభిమానాన్ని సంపాదించుకున్న అల్లు అర్జున్ నటనకుగాను తాజాగా నేషనల్ అవార్డ్ దక్కించుకున్నాడు. ప్రస్తుతం బన్నీ పుష్ప 2 సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్ రిలీజై ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంది.

ఇక అల్లు అర్జున్ మరోసారి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడని ఎప్పటినుంచో వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై అధికారిక ప్రకటన కూడా వెలువడింది. అయితే ఈ సినిమా గురించి తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది. అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్లో నాలుగో సారి వస్తున్న ఈ చిత్రం ఒక పిరియాడిక్ డ్రామా అని టాక్.పైగా మూవీలో వచ్చే ఫ్లాష్‍బ్యాక్‍లో సోషియో ఫాంటసీ ఎలిమెంట్స్ కూడా ఉంటాయని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాని హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ కలిసి సంయుక్తంగా భారీగా నిర్మించనున్నాయి.