ఏ టాబ్లెట్స్ విరిచి వేసుకోకూడదు.. కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు..

ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతుంటే వైద్యుకుల దగ్గరికి వెళతారు. వ్యాధుని గుర్తించి.. అది తగ్గేందుకు అవసరమైన మందులు ఇస్తారు. వాటిని వేసుకుంటే ఆరోగ్యం మెరుగుపడుతుంది. అయితే కొన్ని సందర్భాల్లో మెడిసిన్‌ని విరిచి సగం, సగం వేసుకుంటారు. సగం వేసుకోవడం వలన.. ఆ పవర్ వారికి సరిపోతుందని భావిస్తారు. చాలామంది ఇలాగే చేస్తూ ఉంటారు. మరి నిజంగా టాబ్లెట్‌ని సగం చేయడం సరైనదేనా? సగం విరిచి వేసుకోవడం వలన ప్రయోజనమ? హానికరమా? ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు చూద్దాం.

ఏదైనా మెడిసిన్ విరిచి వేసుకునే ముందు దానిపై రాసి ఉన్న సూచనలను తప్పకుండా చదవాలి. ఇదే విషయాన్ని వెల్లడిస్తూ ఆ మెడిసిన్ పై రాసి ఉంటుంది. ఔషధం వెనక ఈ విషయం రాసి లేకపోతే.. దీని గురించి వైద్యులని గాని, మెడికల్ షాప్ లో వాళ్ళని కానీ అడిగి తెలుసుకోవాలి. అయితే మాత్రలు లేదా క్యాప్సిల్స్ విరిచి తినవద్దని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే… ఇలా సగం వేసుకోవడం వలన అందులోని పవర్ ను తగ్గిస్తుంది. దీంతో దీని ప్రభావం కూడా తగ్గిపోతుందని నిపుణులు చెబుతున్నారు. ఏ మందులు విచ్చిన్నం చెయ్యొద్దు… కొన్ని టాబ్లెట్స్ వెనుక భాగంలో ఎస్ఆర్ (సస్టైన్ రిలీజ్), సిఆర్ (కంట్రోల్ రిలీజ్), ఎక్స్ ఆర్ (ఎక్స్టెండ్ రిలీజ్) అనే చిన్న రూపాన్ని కలిగి ఉంటాయి.

అలాంటి మందులను నేరుగా మింగాలని వైద్యుకులు సూచిస్తున్నారు. ఈ మందులను విరువ‌కూడదు, నమలకూడదు అని దీన్ని అర్థం. ఇటువంటి మాత్రలు శరీరంలో నెమ్మదిగా కరిగిపోతాయి. వీటి ప్రభావం ఎక్కువ కాలం ఉంటుంది. ఏ మందులు విరిచి తినవచ్చు…. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం అన్ని మెడిసిన్స్ ని విచ్చిన్నం చేసి తినలేము. కొన్ని టాబ్లెట్స్ మధ్యలో ఒక లైన్ గీయబడి ఉంటుంది. ఆ మాత్రలు విరిచి వేసుకోవచ్చు. ఈ లైన్ గుర్తింపు ఏమిటంటే… దానిని విరిచి వేసుకోవచ్చని. ఇలాంటి మాత్రలను స్కోర్ మాత్రలు అంటారు. మార్కెట్లో 1000 ఎంజీ ఔషధం అందుబాటులో ఉంటే.. మీకు 500 ఎంజీ మాత్రమే కావాలనుకుంటే.. దానిపై గీత ఉంటే దానిని విరిచి వేసుకోవచ్చు. ఈ విషయాన్ని వైద్యకులు కూడా ముందే చెబుతారు.