“మా ఫ్యామిలీలో తప్పులు జరిగాయి”..పవిత్ర పై నరేష్ కొడుకు సంచలన కామెంట్స్..!!

సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో హీరో నరేష్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్ర లోకేష్ పేర్లు ఏ రేంజ్ లో మారుమ్రోగి పోతున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా వీరిద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తుంది అన్న కామెంట్స్ ఎక్కువగా వినపడుతున్నాయి . అయితే జనాలు ఏమనుకున్నా తమ రిలేషన్ షిప్ ని కంటిన్యూ చేస్తున్నారు నరేష్ పవిత్ర . రీసెంట్ గానే పవిత్ర కన్నడ భాషలో పీహెచ్డీ చేయడానికి ఎగ్జామ్ రాసి టాప్ ర్యాంక్ సాధించిన విషయం తెలిసిందే .

దానికి ఎంతో సహాయపడ్డాడు నరేష్. కాగా ఇలాంటి క్రమంలోనే నరేష్ కొడుకు నవీన్ విజయ్ కృష్ణ ..పవిత్ర లోకేష్ పై చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి . రీసెంట్గా టాలీవుడ్ హీరో సాయిధరమ్ తేజ్ తో సత్య అనే సాంగ్ రూపొందించిన ఈయన ఈ సాంగ్ కి మంచి కామెంట్స్ అందుకున్నాడు. ఇలాంటి క్రమంలోనే రీసెంట్గా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ” తమ ఫ్యామిలీలో జరిగే తప్పు లను బయట పెట్టాడు “.

ఆయన మాట్లాడుతూ ..”అందరి ఫ్యామిలీలో తప్పులు జరుగుతూ ఉంటాయి. మా ఫ్యామిలీలో కూడా అలాగే జరిగాయి. తెలిసి చేశారో తెలియక చేశారో మా నాన్న తప్పు చేశారో ఒప్పు చేశారో.. నాకు తెలియదు కానీ మా నాన్న హ్యాపీగా ఉన్నాడు. అదే నాకు ఇంపార్టెంట్ పవిత్ర లోకేష్ కూడా చాలా మంచివారు . ఆమె ఎక్కువగా అర్థం చేసుకుంటారు. నా కెరియర్ పికప్ అవ్వడానికి ఆమె నాకు ఎంతో ప్రోత్సహించారు . ఆమెని నేను పవిత్ర గారు అంటూ మర్యాదపూర్వకంగానే పిలుస్తాను. ఇక జనాలు వీళ్ళ గురించి ఏం మాట్లాడుకున్నా ఐ డోంట్ కేర్ “అంటూ చాలా సింపుల్ గా తనదైన స్టైల్ లో స్పందించాడు నవీన్ విజయ్ కృష్ణ..!!