వెరీ ఇంట్రెస్టింగ్: NTR తో అనుష్క ఇప్పటి వరకు ఎందుకు కలిసి నటించలేదో తెలుసా..?

సినిమా ఇండస్ట్రీలో కొన్ని కొన్ని కాంబోలు భలే ఇంట్రెస్టింగ్గా సెట్ అవుతుంటాయి. అయితే అలాంటి క్రేజీ కాంబో సెట్ అవ్వని జంటలు కూడా ఉన్నాయి . వాళ్లలో ఒకరే టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ టైగర్ గా పేరు సంపాదించుకున్న ఎన్టీఆర్ – స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి . వీళ్ళిద్దరి కాంబోలో ఇప్పటివరకు ఒక్కటంటే ఒక్క ఫిలిం కూడా రాలేదు. కాగ ఎన్టీఆర్ అనుష్క నటించిన ఓ సినిమాలో గెస్ట్ పాత్రలో కనిపించారు . అది కూడా రెండు నిమిషాలే .

వెంకటేష్ అనుష్క శెట్టి నటించిన చింతకాయల రవి సినిమాలో స్పెషల్ సాంగ్లో రెండు నిమిషాలు అలా మెరిసి వెళ్ళిపోతాడు ఎన్టీఆర్ . అది తప్పిస్తే ఇప్పటివరకు అనుష్క ఎన్టీఆర్ స్క్రీన్ పై ఎక్కడ కలిసి నటించిందిలేదు కనిపించిందిలేదు. దీంతో అసలు ఎందుకు ఈ క్రేజీ కాంబో సెట్ అవ్వలేదు అంటూ ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. అయితే కెరియర్ స్టార్టింగ్ లో ఎన్టీఆర్ చాలా బొద్దుగా ఉండేవాడు అన్న విషయం అందరికీ తెలిసిందే .

అప్పుడు ఎన్టీఆర్ తో నటించడానికి అనుష్క ఇంట్రెస్ట్ చూపించేది కాదట. ఫిజిక్ పరంగా మ్యాచ్ అవ్వదు అంటూ ఆయనతో వచ్చిన అవకాశాలను రిజెక్ట్ చేసిందట . అయితే ఎన్టీఆర్ వెయిట్ తగ్గిన తరువాత ఎన్టీఆర్ క్రేజ్ రేంజ్ ఫుల్ గా మారిపోయింది . డైరెక్టర్స్ అప్పుడు అనుష్కకు ఆయన్ సరసన సినిమా అవకాశాలు ఇవ్వలేకపోయారు . ఈ కారణంగానే అనుష్క ఎన్టీఆర్ ల కాంబో ఇప్పటివరకు కుదరనే కుదరలేదు . ఇకపై కుదురుతుంది అన్న అసలు కూడా లేవు..!!