లావణ్య – వరుణ్ ల మధ్య చిచ్చుపెట్టేసిన సుమ..!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాండీవధారి అర్జున్ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్స్ లో బిజీగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఆగస్టు 25న ప్రేక్షకులు ముందుకు రాబోతున్న ఈ సినిమా పై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ప్రమోషనల్ ఈవెంట్ లో భాగంగా మూవీ యూనిట్ తో పాటు వరుణ్ తేజ్ కూడా పలు కార్యక్రమాలలో ఆసక్తిగా పాల్గొంటున్నాడు. తాజాగా హైదరాబాద్‌లో ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది.

ఈ ఈవెంట్ కు యాంకర్ సుమ హోస్ట్‌గా వ్యవహరించింది. ఇక‌ ఇటీవల వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్ చేసుకున్న సంగతి తెలిసింది. ఈ ఈవెంట్‌లో యాంకర్ సుమ వరుణ్ తేజ్ ను ప్రశ్నిస్తూ త్వరలో భార్య భర్తలు కాబోయే వరుణ్ – లావణ్య దంపతులు మధ్య ఓ చిచ్చు పెట్టేసింది. సుమ ప్ర‌శ్నిస్తు కాల్ మీ అర్జెంట్ అంటూ నిహారిక, లావణ్య నుంచి ఒకేసారి మెసేజ్ వస్తే మీరు ఎవరికి కాల్ చేస్తారు అంటూ వ‌రుణ్ని అడిగింది.

దెబ్బకి వరుణ్ షాక్ ఒక్కసారిగా తల పట్టుకొని నిహారిక చిన్నమ్మాయి కాబట్టి తనకే కాల్ చేస్తా అంటూ సమాధానం ఇచ్చాడు. సోషల్ మీడియాలో ఈ కాన్వ‌ర్‌జేష‌న్ వైరల్ అవడంతో ఒక్క క్వశ్చన్‌తో లావణ్య కి వరుణ్‌కి మధ్యన చిచ్చుపెట్టేశావుగా సుమ అంటూ.. నిహారికనే.. లావణ్య కంటే ఎక్కువ అంటూ వరుణ్ చెప్పక‌నే చెప్పేసాడుగా అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.