64 ఏళ్ల సినీ ప్రస్థానం పై ఫోటోలోని బుడ్డోడు అంత తోపా… ఇంతకీ అతను ఎవరంటే..!?

నాలుగేళ్ల వయసులోనే సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి చైల్డ్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ ని మొదలుపెట్టి ఉప్పుడు ఉన్నత స్థాయిలో ఉన్నాడు. ఏకంగా ఆరు భాషల్లో నటించి సూపర్ హిట్లను అందుకున్నాడు. ఏకంగా 232 చిత్రాలతో 64 సంవత్సరాల పాటు సూపర్ స్టార్‌గా కొనసాగుతున్న హీరో అతను ఒక్కడే. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరు ఇప్పుడు తెలుసుకుందాం.

సినిమా ఇండస్ట్రీలో ఎందరో యంగ్ హీరోలు ఉన్నా సరే ఆయన సినిమాలంటే ఓ రేంజ్ లో ఉంటాయి. ఆయన మరెవరో కాదు లోక‌న‌యుకుడు కమల్ హాసన్. చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి బాక్సాఫీస్ స్టార్ వరకు 64 ఏళ్లుగా పరిశ్రమలో ఆయన చేసిన ప్రయాణం చరిత్రలో నిలిచిపోతుంది. ఇదిలా ఉంటే జాతీయ ఉత్తమ నటుడుగా పురస్కారాన్ని మూడుసార్లు అందుకున్నాడు. 1985లో కె. బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన అపూర్వ రాగంగల్ మూవీ ఆయన కెరీర్ ని మార్చేసింది.

ఈ చిత్రం ద్వారా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత తమిళం తో పాటు ఇతర భాషల్లో కూడా నటించాడు. క‌మ‌ల్ హాస‌న్‌ నటించిన ఉలగనాయగన్ సినిమా భారతీయ సినిమాల్లో రికార్డ్ సృష్టించింది. ఆ చిత్రం ద్వారా క‌మ‌ల్‌ భారతీయ చిత్ర పరిశ్రమకు కొత్త సాంకేతికతను పరిచయం చేశాడు. ఆ తర్వాత 1992లో తన చిత్రం తేవర్ మగన్ తో మొట్టమొదటిసారి ఆస్కార్ ఎంట్రీతో భారతీయ సినిమాలను ప్రపంచానికి పరిచయం చేశాడు.

1985 మరియు 1987 మధ్య ఏకంగా మూడు సినిమాలు ఆస్కార్‌కు నామినేషన్స్ సాధించాయి. వయసు పెరుగుతున్న ఎస్ జస్ట్ నెంబర్ అంటూ సినిమా రంగంలో దూసుకుపోతున్నాడు క‌మ‌ల్‌. ప్రస్తుతం ఇండియన్ 2, ప్రాజెక్ట్ కే చిత్రాల్లో నటిస్తున్నాడు. 68 ఏళ్ల వయసులోనూ ప్రభాస్ చిత్రం కల్కి 2898-AD లో ప్రతి నాయకుడిగా కనిపించనున్నాడు. ఇలా ఈ ఏజ్ లో కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకుపోతున్నాడు కమల్.