సంయుక్త ఆ కుర్ర హీరోకు సెట్ అయ్యిందా… గురూజీ సెట్ చేశాడా…?

ఇటీవల విరూపాక్ష సినిమాతో సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున సంయుక్త ఇండస్ట్రీలోకి వచ్చి చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తుచ్చుకుంది. తను నటించిన అన్ని సినిమాలు హిట్ కావడంతో లక్కీ హీరోయిన్‌గా క్రేజ్ సంపాదించిన ఈ బ్యూటి విరుపాక్ష సినిమాలో తన నటనతో కోట్లాదిమంది ప్రేక్షకులను ఆకట్టుకుంది.

వరుస సినిమా అవకాశాలు వస్తున్నా పలువురు హీరోయిన్స్ లాగా అన్ని సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయకుండా స్లో అండ్ స్టడీగా సినిమాల్లో నటిస్తూ కొన్ని సినిమాలకు మాత్ర‌మే గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. ఇక ఇటీవల కార్తికేయ 2తో పాన్ ఇండియా బ్లాక్ బాస్టర్‌ను తన ఖాతాలో వేసుకున్న నిఖిల్ సరసన సంయుక్త మీనన్ స్వయంభు సినిమాలో నటించబోతుందంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ఠాగోర్ మధు – నిఖిల్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాపై నిఖిల్ భారీ అంచనాలు పెట్టుకున్నాడు.

భారీ కథతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా ఈనెల 18న సెట్స్‌పైకి రానుంది. 18న‌ ముహూర్తం ఫిక్స్ చేసి వెంటనే షూటింగ్ చేయడానికి టీం ఆలోచిస్తున్నారట. ఈ న్యూస్ బయటకు రావడంతో సంయుక్తను స్వయంగా మూవీ టీం ఎంపిక చేశారా..? లేదా సినిమాల పరంగా మొదటి నుంచి సంయుక్తను ఎంకరేజ్ చేస్తున్న త్రివిక్రమ్‌మే ఈ సినిమాకు కూడా సంయుక్తను సిఫార్సు చేశారా..? అంటూ అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు నెటిజ‌న్లు.