టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం ఓవైపు ఫ్యామిలీ లైఫ్ ను.. మరోవైపు కెరీర్ ను సక్సెస్ ఫుల్ గా రాణిస్తున్న సంగతి తెలిసిందే. పెళ్లి అయిన తర్వాత పెద్దగా గ్యాప్ తీసుకోకుండా ప్రెగ్నెంట్ అయిన కాజల్.. గత ఏడాది పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ షురూ చేసిన కాజల్.. చేతి నిండా సినిమాలతో మళ్లీ బిజీ అయింది.
ఇప్పుడు కాజల్ చేతిలో దాదాపు మూడు ప్రాజెక్ట్ లు ఉన్నాయి. అందులో బాలకృష్ణ `భగవంత్ కేసరి` ఒకటి. అనిల్ రావిపూడి ఈ మూవీకి దర్శకుడు. అలాగే శంకర్, కమల్ హాసన్ కాంబోలో తెరకెక్కుతున్న `ఇండియన్ 2`లో కాజల్ హీరోయిన్ గా నటిస్తోంది. వీటితో పాటు `సత్యభామ` అనే లేడీ ఓరియెంటెడ్ మూవీకి కూడా కాజల్ కమిట్ అయింది. మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ.. నిత్యం గ్లామరస్ ఫోటో షూట్లతో నెటిజన్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.
ఇదిలా ఉంటే.. తాజాగా ఓ వేదికగాపై కాజల్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. టాలీవుడ్ హీరోలతో డేట్ కి వెళ్లాల్సి వస్తే ఎవరితో వెళ్తారు..? అనే ప్రశ్న కాజల్ ఎదురైంది. అందుకు చందమామ అక్కినేని మన్మథుడు నాగార్జునతో డేట్ కి వెళ్తానంటూ సమాధానం ఇచ్చింది. టాలీవుడ్ లో ఎంతో మంది యంగ్ స్టార్స్ ఉండగా.. తండ్రి వయసున్న హీరోతో డేట్ కి వెళ్తానని కాజల్ చెప్పడం హాట్ టాపిక్ అయింది. ఇదేం కక్కుర్తి కాజల్ నీకు అంటూ సెటైర్లు పేలుస్తున్నారు. కాగా, `ది ఘోస్ట్` మూవీలో మొదట కాజల్ నే హీరోయిన్ గా ఎంపిక చేశారు. కానీ, అదే సమయంలో ఆమె ప్రెగ్నెంట్ అవ్వడం కారణంగా నాగార్జున మూవీ నుంచి తప్పుకుంది. అయితే నాగార్జున తదుపరి ప్రాజెక్ట్ లో మళ్లీ కాజల్ కు అవకాశం వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.