ఎంద‌రో మోసం చేశారు.. ఆ మాట‌ల‌తో వేధించారు.. యాంకర్ ఝాన్సీ షాకింగ్ కామెంట్స్‌!

స్టార్ యాంక‌ర్ గా, న‌టిగా ఇండ‌స్ట్రీలో త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన గుర్తుంపు సంపాదించుకున్న ఝాన్సీ గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. కెరీర్ ప‌రంగా ఝాన్సీ సూప‌ర్ స‌క్సెస్ అయింది. కానీ, ప‌ర్స‌న‌ల్ లైఫ్‌లో మాత్రం ఫెయిల్ అయింది. జోగి బ్రదర్స్ లో ఒకరైన ఎల్.జోగినాయుడును ఆమె వివాహం చేసుకుంది.

ఈ దంప‌తుల‌కు ఒక కూతురు పుట్టింది. అయితే పాప పుట్టిన కొద్ది రోజుల‌కే వ్య‌క్తిగ‌త విభేదాల కార‌ణంగా భ‌ర్త నుంచి ఝాన్సీ విడాకులు తీసుకుంది. చిన్న వయసులోనే విడాకులైనా కూడా ఝాన్సీ మరో వివాహం చేసుకోలేదు. కూతురు ఆలనా పాలనా చూసుకుంటూ కెరీర్ కొనసాగిస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంట‌ర్యూ పాల్గొన్న ఝాన్వీ త‌న వృత్తి మ‌రియు వ్య‌క్తిగ‌త జీవితంపై షాకింగ్ కామెంట్స్ చేసింది.

`నా గురించి కొత్త‌లో చాలా అనుకున్నారు. ఈవిడకి పొగరు, మాట్లాడితే విప్లవం అంటుంది, ఫైర్ బ్రాండ్ అని మాట‌ల‌తో వేధించేవారు. కానీ, నాతో కలిసి పనిచేసినవారికి నేను ఏమిటనేది తెలుసు. అలాగే నన్ను ఎంద‌రో మోసం చేశారు. అది గుర్తుపెట్టుకుని కక్ష సాధించే పని నేను ఎప్పుడూ చేయలేదు. అది నా మంచితనమో .. పిచ్చితనమో కూడా నాకు తెలియదు. నాకు రావలసిన క్రెడిట్ నాకు రాకుండా చేసిన సందర్భాలు ఉన్నాయి. 24 ఎపిసోడ్స్ చేసిన నన్ను, 25వ ఎపిసోడ్ కేక్ కటింగ్ కి ఉంచరు. 99 ఎపిసోడ్స్ చేసిన డాన్స్ షోకి 100 ఎపిసోడ్ కి నేను యాంకర్ ను కాదు. కారణం చెప్పరు.. నాకు తెలియదు.. నేను అడ‌గ‌ను` అంటూ ఝాన్సీ చెప్పుకొచ్చారు. దీంతో ఈమె కామెంట్స్ కాస్త ఇప్పుడు నెట్టింట వైర‌ల్ గా మారాయి.

Share post:

Latest