అలా చూపిస్తూ కుర్రకారు మతిపోగోడుతున్న నివేత పేతురాజ్..!

సౌత్ సినీ ఇండస్ట్రీలో అత్యంత ప్రతిభావంతులైన హీరోయిన్లలో నివేత పెతురాజ్ ఒకరు. ఆమె మధురై తమిళ కుటుంబంలో జన్మించింది. 11 సంవత్సరాల వయస్సులోనే ఆమె కుటుంబం దుబాయ్‌కి షిఫ్ట్ అయింది. అసలు ఏ మాత్రం సినీ ఇండస్ట్రీ నేపథ్యంలోని కుటుంబం ఆమెది. పదేళ్లు దుబాయ్‌లోనే వారు ఉన్నారు. అయితే సినిమాల్లోకి వెళ్తానన్న నివేతను కుటుంబ సభ్యులు ప్రోత్సహించలేదు. అయితే 2015లో మిస్ ఇండియా యూఏఈ టైటిల్‌ను ఆమె గెలుచుకున్న తర్వాత నివేత జీవితం మారిపోయింది.

కుటుంబ సభ్యులు ఆమెను ప్రోత్సహించారు. దీంతో నివేత 2016లో నెల్సన్ వెంకటేశన్ దర్శకత్వం వహించిన ఒరు నాల్ కూతుతో కోలీవుడ్ సినిమాలో తన నటనను ప్రారంభించింది. దీనికి ప్రేక్షకుల నుంచి డీసెంట్ రెస్పాన్స్ వచ్చింది. అనంతరం వివేక్ ఆత్రేయ రచన, దర్శకత్వంలో శ్రీవిష్ణు సరసన 2017లో వచ్చిన మెంటల్ మదిలో సినిమాలో కనిపించింది. టాలీవుడ్‌లో ఈ సినిమాతో అరంగేట్రం చేసిన ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఏదేమైనా చక్కని అభినయంతో పాటు చూపు తిప్పుకోనివ్వని అందం ఆమె సొంతం. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఆమె పెట్టే ఫొటోలు కుర్రాళ్ల మతులు పోగొడుతున్నాయి.

హీరోయిన్ నివేతకు ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా ఎక్కువ. ఎప్పటికప్పుడు తన తాజా ఫొటోషూట్ లకు సంబంధించి హాట్ హాట్ స్టిల్స్‌ను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటుంది. ఇక ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ అమ్మడికి 2 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. తరచూ ఆమె పెట్టే ఫొటోలకు ఫ్యాన్స్ మైమరిచిపోతున్నారు. ముఖ్యంగా కుర్రాళ్ల మదిలో ఆమె మరింత హీట్ పెంచుతోంది. తెలుగు, తమిళ సినీ ఇండస్ట్రీలలో ఆమె వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులకు మరింత దగ్గర అవుతోంది. పొదువగా ఎన్ మనసు తంగం, టిక్ టిక్ టిక్, తిమిరు పుడిచవన్, సంగతమిజాన్, చిత్రలహరి, బ్రోచేవారెవరురా, అల వైకుంఠపురములో వంటి చిత్రాలతో తమిళంతో పాటు తెలుగు చిత్రాలలో కూడా ఒక ముద్ర వేసింది. ఇటీవలే దాస్ కా దమ్కీ చిత్రంతో ప్రేక్షకులను పలకరించింది.

Share post:

Latest