మహేష్ సినిమాలో బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోయిన్.. త్రివిక్రమ్ ప్లానింగ్ ఏంట్రా బాబు..!

మహేష్ అభిమానులతో పాటు ప్రేక్షకులు సైతం ‘SSMB28’ గురించి ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. అతడు, ఖలేజా వంటి కల్ట్‌ క్లాసిక్స్ తర్వాత మ‌హేష్‌- త్రివిక్ర‌మ్‌ కాంబోలో తెరకెక్కుతున్న హాట్రిక్ సినిమా కావడంతో అందిరిలోనూ ఎక్కడలేని ఆసక్తి నెలకొంది. ఫ్యామిలీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో మహేష్‌కు జోడీగా పూజాహెగ్డే, శ్రీలీలలు నటిస్తున్నారు.

Mahesh Babu to begin shooting for SSMB 28 on January 18, release date, cast  & OTT platform announced

థమన్ స్వరాలందిస్తున్నాడు.. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్‌ రిలీజ్‌ చేశారు త్రివిక్రమ్‌. ఇందులో మహేష్‌ సిగరేట్‌ తాగుతూ, మిర్చీ ఎగిరి పడుతుండగా, వెనకాల లారీ, సైడ్లో కారు వస్తుండగా, ఊరమాస్‌ లుక్‌లో ఆకట్టుకుంటున్నాడు. ఇదిలా ఉండగా ఈ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఏదొక వార్త నెట్టింట వైరల్ అవుతూనే ఉంది.

Mahesh Babu's next SSMB 28 with Trivikram shooting starts tomorrow | The  Maya Bazaar

తాజాగా మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ నెట్టింట వైరల్ అవుతుంది. కాగా ఈ సినిమాలో ఓ బాలీవుడ్‌ సీనియర్ స్టార్‌ హీరోయిన్ కూడా నటిస్తున్నట్లుగా తాజాగా వార్తలు వినిపిస్తున్నాయి. కాగా త్రివిక్రమ్ సినిమాల్లో హీరోయిన్ కాకుండా ఒక లేడీ లీడ్ రోల్ తప్పనిసరిగా ఉంటుంది. వాళ్ళకు చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ కూడా ఇస్తారు. కాగా ఆ రోల్ కు బాలీవుడ్ బ్యూటీ కాజోల్ నటించబోతున్నట్లు తెలుస్తుంది.

ఇక ఇప్పుడు మహేష్ బాబుతో వస్తున్న ఈ సినిమాల్లో కాజోల్‌ను ఒకీలక పాత్ర కోసం ఎంపిక చేసినట్టు తెలుస్తుంది.. ఆ పాత్రకు ఆమె సరిగ్గా సరిపోతుందని ఈ నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు. కాజోల్ తెలుగులో చేస్తున్న మొదటి సినిమా కూడా ఇదే. మరి కాజోల్ ఈ సినిమాలో మహేష్‌కు ఎలాంటి పాత్రలో కనిపిస్తుందా అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.

Share post:

Latest