భీమ్లా నాయక్‌లో రానా క్యారెక్టర్‌ని వదులుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా.. !

వర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే వరుస సినిమా షూటింగ్ లతో గ్యాప్ లేకుండా సినిమాలను కంప్లీట్ చేస్తున్నాడు పవన్.. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన భీమ్లా నాయక్ సినిమా గత సంవత్సరం భారీ అంచనాల నడుమ విడుదలై బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.

 పవన్ కళ్యాణ్

మలయాళం లో సూపర్ హిట్ అయిన ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ సినిమాకి రీమేగా భీమ్లా నాయక్ సినిమా వచ్చింది. ఇందులో పవన్ కళ్యాణ్ తో పాటు మరో యంగ్ హీరో రానా కూడా నటించాడు. రానా ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తో పోటీపడి నటించాడు.. యాటిట్యూడ్ తో తన పొగరుతో పవన్ కళ్యాణ్ కి సరి సమానంగా పోటీపడుతూ తన పెర్ఫార్మన్స్ తో ఇరగదీసాడు. బాహుబలి సినిమాల తర్వాత రానాకి పడినటువంటి అద్భుతమైన సినిమా కూడా ఇదే.

Pawan Kalyan

అయితే ఈ పాత్ర కోసం రానా కంటే ముందుగా ఇద్దరు స్టార్ హీరోలను అనుకున్నారట.. అందులో ఒకరు మ్యాచో స్టార్ గోపీచంద్, అలాగే మాస్ మహారాజా రవితేజ. రవితేజని స్వయంగా పవన్ కళ్యాణ్ ఫోన్ చేసి మరి ఈ సినిమాలో నటించమని అడగగా.. అప్పటికే ఇతర సినిమాలతో బిజీగా ఉండటంతో డేట్స్ అడ్జెస్ట్ అవ్వకపోవడంతో రవితేజ నో చెప్పారట. ఆ తర్వాత దర్శకుడు త్రివిక్రమ్ గోపీచంద్‌ను సజెస్ట్ చేయగా అప్పటికే పవన్ కళ్యాణ్ ఆ క్యారెక్టర్ కి రానా అయితే బాగుంటుందని సూచించినట్టు తెలుస్తుంది.

ravi teja

రానాకి ఈ సినిమా కథ చెప్పగానే ఆయన వెంటనే ఓకే చేశాడట.. ఆ తర్వాత సినిమా విడుదలై ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనందరికీ తెలిసిందే. ఒకవేళ ఈ సినిమాకి రవితేజ ఒప్పుకొని ఉండుంటే ఈ మూవీ రేంజ్ మరోలా ఉండేది అని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

Share post:

Latest