కేతిరెడ్డికి రివర్స్..లోకేష్ వదలలేదు..!

ధర్మవరం నియోజకవర్గంలో వైసీపీ, టీడీపీల మధ్య రాజకీయ యుద్ధం తీవ్ర స్థాయిలో నడుస్తోంది. ఇటీవల లోకేష్ పాదయాత్ర ధర్మవరం నియోజకవర్గంలో కొనసాగింది. ఆ క్రమంలో లోకేష్..అక్కడ వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామి రెడ్డి..అక్రమంగా మట్టి, ఇసుక వ్యాపారాలు చేస్తున్నారని, ఇసుకతో వెళుతున్న లారీలతో సెల్ఫీ దిగారు. అలాగే ధర్మవరం చెరువు మధ్యలో ఉన్న భూములని ఆక్రమించుకుని అక్కడ గెస్ట్ హౌస్ కట్టారని, ఆ గెస్ట్ హౌస్ దగ్గరలో సెల్ఫీ తీసుకున్నారు.

ఇలా లోకేష్ చేసిన ఆరోపణలు పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. దీంతో కేతిరెడ్డి రంగంలోకి దిగి. తాను ఆక్రమించుకుని కట్టలేదని, రైతుల వద్ద భూములు కొనుక్కుని కట్టుకున్నానని చెప్పుకొచ్చారు. అదే సమయంలో మంగళగిరి కరకట్టపై చంద్రబాబు నివాసం ఉంటున్న ఇంటి దగ్గరకొచ్చి..ఇదిగో బాబు అక్రమంగా ఉంటున్న ఇల్లు అని కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ ఆ కౌంటర్లే కేతిరెడ్డికి రివర్స్ అయ్యాయి. ఎందుకంటే బాబు ఉంటున్న ఇల్లు సొంతది కాదు..అద్దెకు ఉంటున్నారు. అలాగే ఆ ఇంటికి పర్మిషన్ వైఎస్సార్ సమయంలోనే ఇచ్చారు. కాబట్టి కేతిరెడ్డి చేసిన కౌంటర్లు రివర్స్ అయిపోయాయి.

అదే సమయంలో లోకేష్..మళ్ళీ కేతిరెడ్డికి కౌంటర్ ఇచ్చారు. చెరువు మధ్యలో పొలాలు కొన్నానని చెబుతున్నారని, కానీ అక్కడ ఉన్నది 45 ఎకరాలు వరకు ఉంటే కేతిరెడ్డి కొన్నది 25 ఎకరాలు వరకే అని, అంటే మిగతా భూమిని కేతిరెడ్డి కబ్జా చేసినట్లే అని ఆరోపించారు. గూగుల్ మ్యాప్స్ ఆధారంగా లోకేష్..కేతిరెడ్డిని టార్గెట్ చేశారు.

రిజిస్ర్టేషన్‌ డాక్యుమెంట్స్‌ ప్రకారం ఎమ్మెల్యే తమ్ముడి భార్య గాలి వసుమతి పేరుతో కొనుగోలు చేసింది 25.38 ఎకరాలు మాత్రమే. అయితే, గుట్టపై మొత్తం 45 ఎకరాల భూమి ఎమ్మెల్యే ఆక్రమణలో ఉందిని,  కొనుగోలుచేసిన భూమిపోగా, మిగిలిన 20 ఎకరాలు కబ్జాచేశారని స్పష్టంగా అర్థమౌతోందని తేల్చేశారు.