ఎన్టీఆర్ తో స్నేహం అంటే అలా ఉంటుంది మరి..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్నేహానికి విలువ ఇచ్చే నటీనటులు చాలామందే ఉన్నారు. అయితే స్నేహానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చే నటుడు గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ పేరు వినిపిస్తూ ఉంటుంది.. ఒకప్పుడు రాజీవ్ కనకాల తారక్ బెస్ట్ ఫ్రెండ్స్ అన్న వార్తలు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తూ ఉంటాయి. అంతేకాకుండా వీరిద్దరి కాంబినేషన్లో బాగానే సినిమాలు వచ్చాయి. నాన్నకు ప్రేమతో సినిమాలో ఎన్టీఆర్ కి అన్న పాత్రలో రాజీవ్ కనకాల నటించిన విషయం తెలిసిందే ..ఆ సినిమా ఎంతో సక్సెస్ను సాధించింది.

అయితే ఒక ఇంటర్వ్యూలో రాజీవ్ కనకాల జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ తారక్ గొప్పతనం ఏంటో ఆయన బిహేవియర్ ఏంటో రాజీవ్ కనకాల మాటల్లో బయటపెట్టారు. అంతేకాకుండా జక్కన్న డైరెక్షన్లో రాజీవ్ కనకాల నాలుగు సినిమాలు చేశానని డేట్స్ సమస్య వల్ల కొన్ని సినిమాలు ఒప్పుకోలేకపోయానని ఆయన తెలిపారు. రాజమౌళి సినిమా అయితే ఎవరైనా చేస్తారు .కానీ చిన్న సినిమాలు నావల్ల నష్టపోకూడదు అని భావించి ఒక సినిమాలో అవకాశాన్ని వదులుకున్నానని తెలిపారు. రాజమౌళి ఇంటికి వెళ్తే బ్రహ్మాండంగా అన్నం పెట్టి మంచి, మర్యాద ఇస్తూ ఉంటారని .. అప్పటికి ఇప్పటికి రాజమౌళి లో ఏ మాత్రం మార్పు లేదని రాజీవ్ కనకాల అన్నారు.

ఇక నా శ్రేయోభిలాషి బెస్ట్ ఫ్రెండ్ ఎన్టీఆర్.. ఎందుకంటే తారక్ నాతో కంఫర్ట్ గా ఫీల్ అయ్యి నాకు తన సినిమాలో అవకాశాలు ఇప్పించారని ఆయన తెలిపారు. మా ఇద్దరి మధ్య ఎమోషనల్ బంధం ఉండటం వల్లే స్నేహం పెరిగిందని వయస్సులో ఎన్టీఆర్ చిన్నవాడైన మంచి మనసు ఉన్న వ్యక్తి.. నాన్నకు ప్రేమతో సినిమాలో ఎన్టీఆర్ కి 5 స్టార్ హోటల్లో రూమ్ బుక్ చేసీ నాకు సాదాసీదా హోటల్లో బుక్ చేశారు. కాని ఎన్టీఆర్ 5 స్టార్ హోటల్ ని వదిలి నాకోసం వచ్చాడు అంటే ఆయన చాలా గ్రేట్ అని తెలిపారు. అందుకే ఎవరేమనుకున్న ఎన్టీఆర్ నా తమ్ముడే అంటూ తెలిపారు రాజీవ్ కనకాల.