ర‌వితేజ `రావ‌ణాసుర‌` రీమేక్ సినిమానా.. ఇదేం ట్విస్ట్ రా బాబు..?

ధ‌మాకా, వాల్తేరు వీర‌య్య వంటి సూప‌ర్ హిట్స్ అనంత‌రం మాస్ మ‌హారాజా ర‌వితేజ నుంచి రాబోతున్న చిత్రం `రావ‌ణాసుర‌`. సుధీర్ వర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ థ్రిల్ల‌ర్ మూవీలో ఫరియా అబ్దుల్లా, అను ఇమ్మాన్యుయేల్‌, మేఘా ఆకాష్, దక్ష నగార్కర్, పూజిత పొన్నాడ హీరోయిన్లుగా న‌టించాడు.

అభిషేక్‌ పిక్చర్స్‌, ఆర్‌టీ టీమ్‌ వర్క్స్‌ బ్యానర్ల పై అభిషేక్‌ నామా, శ్రీకాంత్ విస్సా నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 7న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఇప్ప‌టికే ఈ సినిమాపై భారీ అంచ‌నాల‌ను నెల‌కొన్నాయి. ప్ర‌మోష‌న్స్ తో మేక‌ర్స్ మ‌రింత హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించి ఓ షాకింగ్ న్యూస్ నెట్టింట వైర‌ల్ గా మారింది. అదేంటంటే.. రావ‌ణాసుర రీమేక్ సినిమా అట‌. 2019లో విడుదలైన సూప‌ర్ హిట్ బెంగాలీ మూవీ `విన్సి డా`కి రీమేక్‌ అని ఓ టాక్ బ‌య‌ట‌కు వ‌చ్చింది.

ఓ మేకప్‌ ఆర్టిస్ట్ అనుకోకుండా మర్డర్‌ కేసులో ఇరుక్కోవడం, ఆ ఆర్టిస్టుని అడ్డుపెట్టుకుని ఓ పాపులర్‌ లాయర్‌ నేరాలకు పాల్పడ‌తాడు. అతను నేరాలకు పాల్పడం వెనకాల కార‌ణం ఏంటి అన్న కార‌ణాల‌తో విన్సి డాను రూపొందించారు. ఇక `రావణాసుర` కథ కూడా ఇంచు మించు అలానే ఉంది. ఆయన పాపులర్‌ లాయర్‌. చట్టాలను అడ్డుపెట్టుకుని ఆయన నేరాలకు పాల్పడుతుంటాడు. ఆ నేరాల‌కు కార‌ణం ఏంటి అన్న‌దే స‌స్పెన్స్‌. ఇక విన్సి డా రీమేక్‌ రైట్స్ కొనే రీమేక్‌ చేశారని, అయితే చాలా మార్పులు చేసినట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి ఈ ప్ర‌చారం ఎంత వ‌ర‌కు నిజం అన్న‌ది తెలియాల్సి ఉంది.