Puspa -2 నుంచి రష్మిక బర్తడే అప్డేట్..!!

టాలీవుడ్ లో హీరోయిన్ రష్మిక మందన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఎన్నో చిత్రాలలో నటించి స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతోంది. పుష్ప సినిమాతో పాన్ ఇండియన్ హీరోయిన్ గా పేరుపొందిన ఈ ముద్దుగుమ్మ.. ఈ రోజున తన 27వ బర్తడే ని చాలా ఘనంగా జరుపుకోబోతోంది.. దీంతో రష్మిక అభిమానులు సైతం ఇమే పుట్టినరోజు కనుకాగ పుష్ప-2 సినిమాకు సంబంధించి ఏదైనా అప్డేట్ విడుదల చేస్తారని ఆశగా ఎదురు చూశారు. అనుకున్నట్టుగానే ఈ చిత్రానికి సంబంధించి ఒక పోస్టర్ని విడుదల చేయడం జరిగింది వాటి గురించి తెలుసుకుందాం.

పుష్ప-2 కీ సంబంధించి ఫస్ట్ లుక్ గ్లింప్స్ ఏప్రిల్ ఏడవ తేదీన విడుదల చేయబోతున్నారని టాక్ వినిపించింది. కానీ చిత్ర యూనిట్ పుష్ప -2 సినిమా షూటింగ్ శేరవేగంగా జరుపుకుంటోంది. ప్రస్తుతం సుకుమార్ కూడా ఎక్కువగా ఈ సినిమా మీద దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఇక రష్మిక కు సంబంధించి తాజాగా ఒక ఫస్ట్ లుక్ పోస్టర్ని విడుదల చేయడం జరిగింది.. ఇక ఈ పోస్టర్ విషయానికి వస్తే రష్మిక డి గ్లామరస్ పాత్రలోనే కనిపిస్తూ.. చాలా అమాయకంగా చూపులతో అందరినీ ఆకట్టుకుంటోంది.

పుష్ప సినిమాలో రష్మిక శ్రీవల్లి పాత్రలో అద్భుతంగా నటించింది . పుష్ప -2 సినిమాలో భాగంగా మైత్రి మూవీ మేకర్స్ వారు ఈమెకు సంబంధించి ఒక పోస్టర్ని విడుదల చేస్తూ హ్యాపీ బర్తడే టు అవర్ శ్రీ వల్లి రష్మిక మందన అంటూ ఒక పోస్టర్ని విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్ గా మారుతోంది.