జబర్దస్త్ కమెడియన్ కొమరం నవ్వుల వెనుక ఇన్ని కన్నీటి కష్టాల..!!

సినిమాలలో ఎంతోమంది కమెడియన్లు మనల్ని నవ్వించడానికి పలు ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు.. ఇక బుల్లితెర పైన కూడా నవ్వించే కమెడియన్ల వెనక ఎవరికి తెలియని కొన్ని కన్నీటి కష్టాలు ఉంటాయి. అలా జబర్దస్త్ ఇతర ప్రోగ్రామ్లలో వచ్చిన కంటెస్టెంట్లు కూడా ఇలాంటి బాధలను అనుభవించి ఉంటారు. అలాంటి వారిలో జబర్దస్త్ ఫేమ్ కమెడియన్ కొమరం అలియాస్ కొమరక్క కూడా ఒకరు. తన కామెడీ పంచులతో అదరగొట్టేస్తూ ప్రతి ఒక్కరిని కడుపుబ్బ నవ్విస్తూ ఉంటుంది.ముఖ్యంగా పశువులంటే ప్రాణం అనే రెండు మార్కు డైలాగుతో అందరిని ఆకట్టుకుంది.

తన వాయిస్ మాడ్యులేషన్ తో వేషధారణతో బుల్లితెర ప్రేక్షకులను మెప్పించిన కొమరం ఇప్పుడిప్పుడే వెండితెరపై కూడా మెరుస్తూ ఉన్నారు. తాజాగా నాని, కీర్తి సురేష్ నటించిన దసరా సినిమాలో కనిపించారు. ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో హాజరైన కొమరం తన జీవితంలో జరిగిన చేదు అనుభవాలను సైతం తెలియజేయడం జరిగింది. కొమరం మాట్లాడుతూ నేను ఇండస్ట్రీలోకి రాకముందు రకరకాల పనులు చేశాను హైదరాబాదులోని సిగ్నల్స్ దగ్గర స్కూల్ బ్యాగులు గొడుగులు అమ్మాను అంటూ తెలిపారు.

కోటిలో నిలబడి వస్తువులు కూడా విక్రయించాను హోటల్లో కూడా పనిచేశాను సామాన్లు కడిగాను ఇండస్ట్రీలోకి వచ్చాక ఎన్నో ఇబ్బందులు పడ్డా కానీ సక్సెస్ అయ్యాను ఐదేళ్ల లైఫ్లో ఇబ్బందులు పడ్డ అలాంటి పరిస్థితులు మళ్లీ రాకూడదని కోరుకుంటున్నానని తెలిపింది కొమరక్క. ఇవి తలుచుకుంటే ఎప్పుడు ఏడుపొస్తుంది మా నాన్నమ్మ చనిపోయినప్పుడు చాలా బాధేసింది మా అమ్మ కూడా సినిమాలలోకి పొమ్మని చెప్పేది మా చెల్లెలు అంటే నాకు చాలా ప్రాణం తన భార్య కూడా ఐదేళ్ల పాటు రాత్రింబగళ్లు టైలర్ చేసి తనకు నెలకు 3000 అకౌంట్లో వేసేది అని తెలిపారు కొమురక్క.