భారీ ధరకు “NBK108” డిజిటల్ రైట్స్.. బాల‌య్య ఖాతాలో మరో అరుదైన రికార్డ్..!

గ‌త రెండు సంవ‌త్స‌రల నుంచి నంద‌మూరి బాల‌కృష్ణ ఏ సినిమా చేసిన అది ఓపెద్ద సెన్సేషన్ అవుతుంది. అఖండ‌తో మొద‌లు పెట్టిన విజ‌యప‌రంప‌ర ఈ సంక్రాంతికి వ‌చ్చిన వీర‌సింహ‌రెడ్డితో మ‌రో లేవ‌ల్‌కు వెళ్ళింది. ఇటు సినిమాల‌తోనే కాకండా బుల్లి తెర‌పై కూడా బాల‌య్య అదరగొడుతున్నాడు. ఇక ఇప్పుడు ఇవన్నీ కలిసి బాలయ్య – అనిల్ రావిపూడి కాంబినేషన్లో వస్తున్న బాలయ్య 108వ సినిమాకు ప్లస్ అవుతున్నాయి.

NBK 108: 'అన్న దిగిండు.. ఈ సారి మీ ఊహకు మించి'.. బాలయ్య ఫస్ట్​ లుక్​  చూశారా?​, nbk 108 movie update hero nandamuri balakrishna first look  released

ఇక ఈ సినిమాలో బాల‌య్య‌ సరసన కాజల్ నటిస్తోంది. మ‌రో అంద‌ల భామా శ్రీలీల‌ కూడా ఈ సినిమాలో న‌టిస్తుంది. ఇక ఈ సినిమాలో బాలయ్యను మునుపెన్నడూ చూడని విధంగా అనిల్ రావిపూడి ప్రెజెంట్ చేస్తుండటంతో టాలీవుడ్‌లోనే ఈ సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. అంతేకాకుండా కోలీవుడ్ సీనియర్ హీరో శరత్ కుమార్ కూడా ఓ కీల‌క ప్రాత‌లో న‌టిస్తున్న‌డు.

Balakrishna Kajal Aggarwal Sreeleela's NBK108 Aims For Dussehra 2023  Release? | NBK 108 Aims Dussehra 2023 : విజయదశమికి బాలకృష్ణ - కాజల్ సినిమా!

ఈ సినిమా డిజిటల్ హక్కులను భారీ రేట్ కు అమ్మేసారు. అమెజాన్ ప్రయిమ్ సంస్థకు రూ.36 కోట్లకు డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ విక్రయించినట్లు తెలుస్తోంది. బాల‌య్య కేరీర్ లోనే ఇది టాప్‌. ఈ సినిమా బిజినెస్ ఇంకా ఓప‌న్‌ చేయలేదు. శాటిలైట్, హిందీ డబ్బింగ్, అడియో వుండనే వున్నాయి. బాలయ్య-అనిల్ రావిపూడి సినిమాకు కాస్త భారీగానే బడ్జెట్ అవుతోంది. వంద కోట్లకు పైగా ఈ సినిమా బడ్జెట్ అవుతుందని తెలుస్తోంది.

అందువల్ల నాన్ థియేటర్ మీద కనీసం రు. 60 నుంచి 70 కోట్ల వరకు రాబట్టగలగాలి. అప్పుడే థియేటర్ల‌ మీద కాస్త భారం తగ్గుతుందని అంటున్నారు. విజ‌యదశమికి ఆయుధ పూజ అంటూ దసరా బరిలో సినిమాను విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. మరి ఈ సినిమాతో బాలయ్య ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తాడో చూడాలి.