కె. విశ్వనాథ్ తీర‌ని క‌ల‌.. ఎంతో ఆశ‌ప‌డ్డ నెర‌వేర‌లేదు!

కళాతపస్వి కె.విశ్వనాథ్ కన్నుమూసిన సంగ‌తి తెలిసిందే. ఆయన వయసు 92 సంవత్సరాలు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన గురువారం రాత్రి తుది శ్వాస విడిచారు. ఆయన మృతి తెలుగు చలనచిత్ర పరిశ్రమకే తీరనిలోటుగా మారింది. కె.విశ్వనాథ్ మ‌ర‌ణం ప‌ట్ల‌ కుటుంబ‌స‌భ్యులు కున్నీరు మున్నీరు అవుతున్నారు.

మ‌రోవైపు సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు ఆయ‌న మృతికి సంతాపం తెలుపుతూ.. కళాతపస్వి వలను గుర్తుచేసుకుంటున్నారు. 1965లో అక్కినేని నాగేశ్వరావు హీరోగా నటించిన `ఆత్మ గౌరవం` సినిమాతో దర్శకుడిగా తెలుగు ప‌రిశ్ర‌మ‌కు ప‌రిచ‌యం అయిన కె.విశ్వనాథ్‌.. ఆ త‌ర్వాత సిరిసిరిమువ్వ, శంకరాభరణం, సప్తపది, సాగరసంగమం, స్వాతిముత్యం, సిరివెన్నెల, శ్రుతిలయలు, స్వయంకృషి, స్వర్ణకమలం, సూత్రధారులు, స్వాతికిరణం వంటి ఎన్నో క్లాసికల్‌ చిత్రాలను ప్రేక్షకులకు అందించారు.

ద‌ర్శ‌కుడిగానే కాకుండా న‌టుడిగానూ త‌న‌దైన ముద్ర వేశాడు. ఇక‌పోతే ఐదు ద‌శాబ్దాల పాటు సినీ ప‌రిశ్ర‌మ‌కు త‌న సేవ‌లు అందించిన‌ విశ్వ‌నాథ్ కు ఓ తీర‌ని కల ఉండిపోయింది. ఆయ‌న త‌న కెరీర్ లో ఎక్కువ‌గా సాంఘిక సినిమాలే చేశారు. పౌరాణికం వైపు వెళ్లలేదు. ఈ జోన‌ర్ పై పెద్ద‌గా అవ‌గాహ‌న లేక‌పోవ‌డం వ‌ల్ల అటువైపు తొంగి చూడ‌లేదు. కానీ, అన్న‌మ‌య్య సినిమా చేయాల‌ని విశ్వ‌నాథ్ క‌ల క‌న్నార‌ట‌. చాలా ఏళ్ల పాటు అన్న‌మ‌య్య క‌థ‌పై ప‌రిశోధ‌న చేశారు. అయితే ఆ క‌థ‌తోనే మ‌రో ద‌ర్శ‌కుడు సినిమా చేస్తున్నార‌ని తెలియ‌గానే విశ్వ‌నాథ్ త‌న ప్ర‌య‌త్నాన్ని మానుకున్నారు. మొత్తానికి అన్న‌మ‌య్య క‌థ‌పై కళాతపస్వి ఎంతో ఆశ‌ప‌డ్డ నెర‌వేర‌లేదు.