జయసుధ జాతకం ముందే చెప్పిన తండ్రి.. అసలు సంగతి ఏమిటంటే..!?

తెలుగు చిత్ర పరిశ్రమలో సీనియర్ నటీమణులలో జయసుధ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. తెలుగులో సహజనటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న జ‌య‌సుధ‌ ఎన్నో సినిమాల్లో నటించి తన నటనతో మరింత పాపులారిటీ దక్కించుకుంది. అందుకే కొన్ని సంవత్సరాలపాటు చిత్ర పరిశ్రమంలో స్టార్ హీరోయిన్‌గా కొనసాగింది. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తూ తన కెరియర్ లో దూసుకుపోతుంది.

ఒకప్పటి ఈ అందాల సోయగం ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది.. ఫోటో చూసి  షాక్ అవుతున్న నెటిజన్లు.. | Senior heroine jayasudha latest photo goes  viral. | TV9 Telugu

ఇదిలా ఉండగా జయసుధ జీవితంలో ఎన్నో సంఘటనలు, ఎన్నో మలుపులు కూడా ఉన్నాయట. మరి ప్రధానంగా జయసుధకు సినిమాలంటే ఇష్టం లేదట అయ‌న అంత ఇష్టం లేని సినిమాలలోకి వచ్చి సహజ నటిగా ఎలా ఎదిగింది? దర్శకురాలుగా, నిర్మాతగా ఎలా మారింది? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.. జయసుధ తల్లి పేరు జోగాబాయ్.. ఆమె ఆ రోజుల్లోనే సినిమాల్లో నటిస్తూ ఉండేది. సినిమాలంటే కూడా ఆమెకు ఎంతో ఇష్టం. జయసుధ తండ్రి పేరు రమేష్ వీరిద్దరికి జన్మించిన జయసుధ అసలు పేరు సుజాత.. సినిమాలంటే అసలు ఇష్టం లేని సుజాతకు సినిమాలు చూడటం కూడా ఇష్ట పడేది కాదు.

Jayasudha : ఇండస్ట్రీకి వచ్చి 50 ఏళ్లు అయింది.. ఇక్కడ పట్టించుకునే వాళ్ళు  లేరు.. | jayasudha completed 50 years in industry

అలాంటి సుజాత సినిమాల్లోకి వచ్చి జయసుధ లాగా ఎలా మారింది. చిత్ర పరిశ్రమంలోకి ఎలా వచ్చింది? ఇంత మంది అభిమానులను ఎలా త‌న‌ నటనతో మెప్పించగలిగింది. అంటే దానికి ముఖ్య కారణం సూపర్ స్టార్ కృష్ణ భార్య విజయనిర్మల అని తెలుస్తుంది. జయసుధ చిన్నతనంలోనే తన తండ్రి రమేష్ ఆమె జాతకం రాయించారట. అందులో జయసుధ గొప్ప నటి అవుతుందని, స్టార్డం చూస్తుందని, ఎంతో పేరు ప్రఖ్యాతలు అంతకుమించి డబ్బు కూడా వస్తుందని చెప్పారట జ్యోతిష్యులు.

Get To Know Jayasudha Biography, Age, Career, Height, Net Worth,  Relationship & More

మూడు గంటల పాటు ఒక గదిలో కూర్చోపెట్టి సినిమా చూపించడం అంటే ఇష్టం లేని జయసుధకు అలాంటిది విజయనిర్మల దర్శకత్వం వహించిన పండంటి కాపురం సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ఆ సినిమా తర్వాత నుంచి చిత్ర పరిశ్రమంలో అంచులంచులుగా ఎదుగుతూ స్టార్ హీరోయిన్‌గా మారింది. ఈ సందర్భంలోనే తన చిన్నతనం లోని విషయాలు గుర్తొచ్చినప్పుడల్లా జయసుధ నవ్వుకుంటూ ఉంటుందట. ఈ విధంగా జయసుధత తండ్రి గీయించిన జాతకం ప్రకారం తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర నటిగా కొనసాగుతూ ఎంతో డబ్బు పేరు ప్రఖ్యాతలు కూడా సంపాదించింది.