చిరంజీవి విశాఖవాసిని అవుతాను అనడం వెనుక ఇంత కథ ఉందా..?

విశాఖ తో మెగాస్టార్ చిరంజీవికి చాలా అనుబంధం ఉంది.సినీ బాక్సాఫీస్ లెక్కల్లో నైజాంలో లాంటి చిరంజీవికి వాల్తేరు సినిమా కూడా గట్టి అడ్డగానే మారిపోతోంది. విశాఖలో మంచి క్రేజ్ ఉందని సినీ ప్రముఖులు సైతం తెలియజేస్తూ ఉంటారు.తాజాగా వాల్తేర్ వీరయ్య ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ లో కూడా చిరంజీవి విశాఖ వేదికపై పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. ముఖ్యంగా విశాఖ అంటే ఆయనకు ఎంత ఇష్టమో.. అక్కడ ప్రజలు అంటే ఎంత ప్రేమ ఆయన మాటలలో తెలియజేశారు. దీంతో చిరంజీవి ఇల్లు ఇక్కడే కట్టుకోవాలని ఉందంటూ కూడా తన మనసులో మాటను తెలియజేశారు.

No Chiranjeevi's Studio In Visakhapatnam

హైదరాబాద్ వాసికి సడన్గా విశాఖ మీదకు ఎందుకు మనసు మళ్లింది అనే వార్తలు కూడా చాలా వైరల్ గా మారుతున్నాయి. చిరంజీవి విశాఖవాసి కావాలని ఎందుకు కోరుకుంటున్నారు అనే విషయం తన మనసులో మాటను ఆయన పరోక్షంగా చెబుతున్నారా అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు మూడు రాజధానుల గొడవ చాలా ఎక్కువగా నడుస్తోంది. విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కావాలంటూ ఆ మధ్య పలు నినాదాలు వినిపించాయి. అందుకు మద్దతుగా ఏపీ ప్రభుత్వం కూడా ఉన్నది.

అయితే ఈ విషయం పైన కొంతమంది వ్యతిరేకత కూడా చూపిస్తున్నారు. దీంతో ఇప్పుడు విశాఖ తీరంగ పొలిటికల్ తుఫాను కూడా చాలా చెలరేగిపోతోంది.ఈ నేపథ్యంలో విశాఖ వాసిని అవుతానని వాల్తేరు వీరయ్య సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో చిరంజీవి ఈ మాట చెప్పడంతో ఏపీలో మరొకసారి పొలిటికల్ గా చాలా హీట్ ఎక్కిపోతోంది. చిరంజీవి మాటలు వెనుక అర్థం మూడు రాజధానులకు పరోక్షంగా మద్దతు ఇస్తున్నారా అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఇక్కడే స్టూడియో కట్టాలని కోరిక కూడా ఉందని తెలియజేసినట్లు సమాచారం. మరి చిరంజీవి వేటిని ఉద్దేశించి ఇలా అన్నారో తెలియాల్సి ఉంది.