సీనియర్ స్టార్ హీరోలలో ఒకరైన మోహన్ లాల్ కు టాలీవుడ్ లో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పవచ్చు. మలయాళం ఇండస్ట్రీకి చెందిన నటుడైనప్పటికీ విభిన్నమైన పాత్రలలో సినిమాలలో నటిస్తూ స్టార్ హీరోగా ఒక వెలుగు వెలుగుతున్నారు. చిన్న పాత్రలలో నటించిన మోహన్ లాల్ ఆ పాత్రకు పూర్తిస్థాయిగా న్యాయం చేసి సక్సెస్ ని సొంతం చేసుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే వరుస ప్లాపులతో సతమతమవుతున్న మోహన్ లాల్ కెరియర్ కాస్త అంచనాలకు భిన్నంగా ఉందని చెప్పవచ్చు.
మలయాళం లో ఈ హీరో నటించిన సినిమాలు వరుసగా విడుదలవుతున్న ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోతున్నాయి. మోహన్ లాల్ కథల ఎంపిక విషయంలో చాలా తడబడుతున్నారని సోషల్ మీడియాలో అభిమానులు తెలియజేస్తున్నారు. గత ఏడాది మాన్ స్టర్ చిత్రంతో మోహన ప్రేక్షకుల ముందుకు రాక ఈ సినిమా కూడా ఫ్లాప్ గా నిలిచింది. ఇక దృశ్యం 2 సినిమా వరకు వరుస విజయాలను సొంతం చేసుకున్న మోహన్లాల్ అలోన్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా కూడా పెద్దగా కలెక్షన్లు సాధించలేదని వార్తలు వినిపిస్తున్నాయి.
కేవలం ఈ సినిమా నుంచి రూ.45 లక్షల రూపాయలు మొదటి రోజు కలెక్షన్లు సాధించింది అంటే ఈ సినిమా ఏ రేంజ్ లో డిజాస్టర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మోహన్ లాల్ నాసిరకం కథలను ఎంచుకోవడం వల్లే ఇలాంటి ఫలితాలు ఎదురవుతున్నాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి. మోహన్లాల్ తర్వాత ప్రాజెక్టులకు విజయాలను సొంతం చేసుకోవాలని అభిమానుల సైతం కోరుకుంటున్నారు. నటుడుగా మోహంలో స్థాయికి అంతకంతకు పెరిగిపోతూనే ఉంది రెమ్యూనరేషన్ లో కూడా భారీగానే తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.