ఆహాలో ప్రసారమవుతున్న అన్ స్టాపబుల్ సీజన్ 2 కి ఎంత రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ షో ఓటీటి లోనే బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచింది. ఇందులో ఎంతో మంది స్టార్ హీరోలని ఎక్కువగా బాలయ్య తన ప్రశ్నలతో తికమొక పెట్టారని చెప్పవచ్చు. అలాగే రాజకీయ ప్రముఖులను కూడా మొదటిసారి స్టేజి మీదకి తీసుకోవచ్చరు.వారితో సందడి చేయించారు. అలా ప్రభాస్, శర్వానంద్, గోపీచంద్ ,అడవి శేషు చంద్రబాబు నాయుడు తదితర నటీనటులను ఈ షోలో మాట్లాడించి వారి గురించి కొన్ని విషయాలను బయట పెట్టడం జరిగింది.
ప్రభాస్ ఎపిసోడ్ ఏన్నో సంచలనాన్ని సృష్టించింది. ఏకాంగ ఆహా చానాల్లో కూడా మొరాయించే స్థాయికి చేరిపోయింది. రెండో ఎపిసోడ్ గా వచ్చిన ప్రభాస్ ఇంటర్వ్యూ అద్భుతంగా క్లిక్ అయిందని చెప్పవచ్చు. హిస్టరీ లోనే మోస్ట్ బజ్ ఎపిసోడ్ గా పవన్ కళ్యాణ్ ఎపిసోడ్లో భాగం కాబోతోంది. పవన్ కళ్యాణ్ ని రెండు ఎపిసోడ్లుగా టెలికాస్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగా మొదటి ఎపిసోడ్ ప్రోమో ని తాజాగా విడుదల చేయడం జరిగింది. ఈ ప్రోమో విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ గుడుంబా శంకర్ లో ఫ్యాన్లు వేసిన విషయంపై ఆసక్తికరమైన ప్రశ్న అడిగారు బాలయ్య. అలాగే త్రివిక్రమ్ తో ఉన్న ఫ్రెండ్షిప్ గురించి ప్రశ్న వేయగా ఆ తర్వాత రాంచరణ్ తో ఎందుకు క్లోజ్ అయ్యారని ప్రశ్నలు వేశారు.
వీటన్నిటికీ పవన్ కళ్యాణ్ సమాధానాలు తెలియజేశారు మధ్యలో సాయి ధరంతేజ్ ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల గురించి కూడా బాలకృష్ణ ప్రశ్న అడగగా అందుకు పవన్ కళ్యాణ్ ఏదో సమాధానం చెప్పాడు. అలాగే చిన్న వయసులో మానసిక సంఘర్షణకు గురైన పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ గా ఎలా మారారో అనే విషయాన్ని కూడా తెలియజేశారు ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ గా మారుతోంది.