తెలుగు సినీ పరిశ్రమకు సరికొత్తదనాన్ని అందించిన నటులలో కృష్ణ మొదటి స్థానంలో ఉంటారని చెప్పవచ్చు. ఎంతోమంది అభిమానులను సంపాదించడమే కాకుండా ఎంతో మందికి ఎన్నో రకాలుగా సహాయాలు కూడా చేశారు కృష్ణ. ఇలా ఎన్నో రికార్డులను నెలకొన్న నటశేఖరుడు లేడనే విషయం తెలుసుకొని.. కృష్ణ అభిమానులతో పాటు సినీ ప్రముఖుల సైతం కృష్ణ కు సంబంధించి పలు ఆసక్తికరమైన విషయాలు బయటికి తెలియజేయడం జరుగుతోంది. అందులో ఒక విషయం వైరల్ గా మారుతోంది వాటి గురించి చూద్దాం.
కృష్ణ పెద్ద కుమార్తె పద్మావతి వివాహ వేడుకలు గల్లా జయదేవ్తో చెన్నైలో చాలా అంగరంగ వైభవంగా జరిగాయి.. అప్పుడు ముఖ్యమంత్రి నటి జయలలితను కృష్ణ స్వయంగా వెళ్లి వివాహానికి ఆహ్వానించారు. చెన్నైలోనే వివాహం జరుగుతూ ఉండడంతో అందరూ ఆమె వస్తుందని భావించారు.అయితే వివాహానికి మూడు రోజుల ముందు జయలలిత సెక్యూరిటీ ఆఫీసర్ వచ్చి కృష్ణను కలిశారు ఈ సందర్భంగా కళ్యాణమండపంలో మొదటి మూడు వరుసలు భద్రత కారణాల రీత్యా జయలలితకు కేటాయించాల్సిందిగా సెక్యూరిటీ ఆఫీసర్ కోరారట.
దీంతో షాక్కు తిన్న కృష్ణ తెలుగు రాష్ట్రాల నుంచి అనేకమంది సినీ, రాజకీయ ప్రముఖులు వివాహానికి వస్తూ ఉంటారు. మొదటి మూడు వరుసలు పూర్తిగా కేటాయించడం కుదరదని చెప్పేశారట. ఆ వెంటనే కృష్ణ జయలలితకు ఫోన్ చేసి ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు వివాహానికి రావద్దంటూ సున్నితంగా తెలియజేశారట. మీ ఆశీర్వచనాలు ఉంటే చాలని చెప్పారట కృష్ణ దీంతో అసలు విషయాన్ని అర్థం చేసుకున్న జయలలిత వివాహానికి హాజరుకాకుండా పెళ్లి రోజున వధూవరులకు ఒక బొకే ని పంపించండి. ఇక కృష్ణ జయలలిత కాంబినేషన్లో గూఢచారి 116, నిలువు దోపిడి వంటి తదితర చిత్రాలలో నటించారు. ప్రస్తుతం ఈ విషయం మాత్రం వైరల్ గా మారుతోంది.