సీనియర్ ఎన్టీఆర్ ఆ దుస్తులు ధరించడానికి కారణం..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో అలనాటి హీరో నందమూరి తారకరామారావు కేవలం ఒక నటుడు గానే కాకుండా నిర్మాతగా, దర్శకుడుగా, రాజకీయవేత్తగా ఎవరికి సాధ్యం కాని రికార్డులను సైతం సృష్టించారు. ఇప్పటికి తెలుగు ప్రేక్షకులకు ఎన్టీఆర్ అంటే చెరగని ముద్రగ పేరు సంపాదించారు. సినిమా నటుడు గానే ఉంటూ తెలుగుదేశం పార్టీని స్థాపించి తొమ్మిది నెలలలోని ముఖ్యమంత్రిగా అయ్యారు. అంతేకాకుండా ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక కాషాయం దుస్తులలోని ఎక్కువగా కనిపించేవారు .అయితే అలా కాషాయ దుస్తులను కనిపించడానికి ఒక ముఖ్య కారణం ఉందట వాటి గురించి తెలుసుకుందాం.

wall photos: 01/17/13
ఎన్టీఆర్ తిరుపతిలో జరిగిన ఒక సినిమా అవార్డు ఫంక్షన్ కి వెళ్లారట. అక్కడ మొదటిసారి కాషాయ దుస్తులలో కనిపించి అందరిని ఆశ్చర్యపరిచారట .ఎందుకు అలా వచ్చారు అని అడిగే ధైర్యం ఎవరికి అప్పట్లో లేదట. అయితే ఆ అవార్డు ఫంక్షన్ తర్వాత కొంతమంది విలేకరులు ఆయనను ప్రశ్నించారు. అందుకు ఎన్టీఆర్ మాట్లాడుతూ ఒక సంఘటన తన జీవితాన్ని పూర్తిగా దిగ్భ్రాంతికి చేసిందని అందుచేతనే ఈ కాషాయ వస్త్రాలను ధరించాలని తెలియజేశారట. ఇక ఎన్టీఆర్ సీఎంగా ఉన్న సమయంలో చిన్నారులపై అత్యాచారలు జరిగిన సంఘటనలు అతన్ని కలిసి వేశాయట.

NTR: ఎన్టీఆర్ కాషాయ దుస్తుల వెనక ఉన్న మాస్టర్ మైండ్ ఎవరంటే.. | NTR  Legenderay Actor Senior NTR Wear Saffron dress this person was the  mastermid– News18 Telugu

దీంతో జీవితం పట్ల విరక్తి పుట్టిందని ఎన్టీఆర్ తెలియజేశారు. ఇక ఆ సమయంలోనే హైదరాబాద్ కు అగ్ని వేష్ స్వామి రావడంతో ఆయన దగ్గరికి వెళ్లి ఈ బట్టల గొప్పతనం గురించి తెలుసుకున్నారట. అందుచేతనే అప్పటినుంచి ఎన్టీఆర్ ఎక్కువగా కాషాయ దుస్తులలోనే కనిపించే వారిని సమాచారం. అయితే ఎన్టీఆర్ కు ఆగ్నీ వేశ్ ఏం చెప్పారంటే సన్యాసిగా ఉంటే ఎలాంటి స్వార్థం ఉండదు. మనకోసం కాకుండా సమాజం కోసం పనిచేయాలని తపన మనలో మొదలవుతుందని ఎన్టీఆర్ కి హితబోధ ఇచ్చారట. ఇక అప్పటినుంచి ఎన్టీఆర్ వాటిని ఫాలో అవుతున్నట్లు సమాచారం.