అంబటి-కొట్టు-పేర్ని..పవన్ దెబ్బతప్పదా.!

ఏపీ రాజకీయాల్లో ఎవరైనా ప్రత్యర్ధి నాయకులని తిట్టాలంటే వారి వర్గానికి చెందిన నేతలతోనే తిట్టించడం పరిపాటి అయిపోయింది. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఇది మరింత ఎక్కువైంది. టీడీపీ అధినేత చంద్రబాబుని తిట్టాలంటే కొడాలి నాని, వల్లభనేని వంశీలు ఎక్కువ మీడియాలో ఉంటారు. అటు పవన్‌ని తిట్టాలంటే అదే కాపు వర్గానికి చెందిన పేర్ని నాని, అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్, కొట్టు సత్యనారాయణ లాంటి వారు ముందుంటారు.

ఇలా ఏ వర్గం వారిని..ఆ వర్గం నేతలని తిట్టిస్తుంటారు. అందుకే తాజాగా పవన్ సైతం..వైసీపీపై విరుచుకుపడుతూ..తనని పదే పదే టార్గెట్ చేస్తున్న వైసీపీ కాపు నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇకపై తనని ప్యాకేజ్ స్టార్ అంటే చెప్పు తీసుకుని కొడతానని అన్నారు. అలాగే ప్రత్యేకంగా బంతి కొట్టు సన్నాసులకు చెబుతానని వార్నింగ్ ఇచ్చారు. అయితే ఇందులో బంతి చామంతి పూబంతి అని విమర్శించేది అంబటి రాంబాబు, అవంతి శ్రీనివాస్‌లనే వారికే వార్నింగ్ ఇచ్చారని అనుకోవచ్చు. అలాగే మంత్రి కొట్టు సత్యనారాయణని కూడా టార్గెట్ చేశారు. చివరిగా పేర్ని నానిపై విరుచుకుపడ్డారు.

అయితే ఇలా పవన్ ఎవరినైతే వైసీపీ కాపు నేతలని టార్గెట్ చేశారో..వారికి టీడీపీ-జనసేన పొత్తు వల్ల నష్టం తప్పేలా లేదు. గత ఎన్నికల్లో టీడీపీ-జనసేన మధ్య ఓట్లు చెలడం వల్లే వైసీపీలో ఎక్కువ మంది కాపు నేతలు గెలిచారు. ఇప్పుడు ఆ రెండు పార్టీలు కలిసి పోటీ చేయడం వైసీపీ కాపు నేతలకే రిస్క్. ముఖ్యంగా పేర్ని నాని, అంబటి రాంబాబు, కొట్టు సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్, అవంతి శ్రీనివాస్, కన్నబాబు, గ్రంథి శ్రీనివాస్ లాంటి వారిపై పొత్తు ప్రభావం బాగా ఉండనుంది.

ఈ కాపు నేతలే కాదు..ఇంకా చాలామంది వైసీపీ ఎమ్మెల్యేలపై టీడీపీ-జనసేన పొత్తు ప్రభావం ఉండనుంది. కాబట్టి ఈ సారి పొత్తు దెబ్బ వైసీపీకి గట్టిగా తగిలేలా ఉంది.