మంచి మనసు చాటుకున్న ఉపాసన..బస్తీ పిల్లల కోసం..?

మెగాస్టార్ చిరంజీవి కోడలుగా మెగా పవర్ స్టార్ రాంచరణ్ సతీమణిగా ఉపాసన ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకుంది. ఉపాసన ఒక సెలబ్రిటీ మాత్రమే కాదు అంతకుమించి అని చెప్పవచ్చు. వైద్యరంగంలో ఈమె ప్రజలకు చేసిన సేవలు ఇప్పటికీ చిరస్మరణీయమని చెప్పాలి. కరోనా సమయంలో సోషల్ మీడియా ద్వారా ఎంతో మందికి ధైర్యం నింపి తన అపోలో హాస్పిటల్ ద్వారా చాలా వరకు ఫీజు లేకుండా ఉచితంగా వైద్యాన్ని అందించింది. అంతేకాదు అపోలో హాస్పిటల్స్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత మరెన్నో కార్యక్రమాలను చేస్తూ మరింత మంచి మనసున్న చాటుకుంటుంది ఉపాసన. ఇటీవల వృద్ధాశ్రమాలకు కొన్ని కోట్ల రూపాయలను విరాళంగా ప్రకటించిన ఈమె ఇప్పుడు మరొకసారి బస్తీ పిల్లల కోసం మరో ముందడుగు వేసింది.Ram Charan's Wife, Upasana Kamineni Repeats Her Pre-Wedding Lehenga After 9  Years With A Twist

ఉపాసన ఇంట్లో పనిచేసే లక్ష్మణ్ ఎన్నో సంవత్సరాల నుంచి నమ్మకంగా పనిచేస్తున్నారు. ఒకసారి మాటల సందర్భంగా బస్తీ పిల్లల కోసం స్కూల్ కట్టించడానికి రెడీగా ఉన్నానని ఉపాసన అనడంతో అప్పుడు చెప్పినట్లుగానే మాట మీద నిలబడ్డారని అపోలో ఫౌండేషన్ ద్వారా త్వరలో స్కూల్ కట్టించబోతున్నారని లక్ష్మణ్ తెగ ఆనందపడుతూ తెలిపాడు. తాజాగా ఆ బస్తీ లో వినాయక చవితి వేడుకకు అతిథిగా వచ్చిన మెగా కోడలు ఉపాసన స్కూల్ కట్టే విషయమై మీడియాతో మాట్లాడింది.. ఆమె మాట్లాడుతూ లక్ష్మన్ ఇంట్లో ముఖ్యమైన వ్యక్తి అని చెప్పినామే.. అతడికి కావాల్సిన సాయం చేయడానికి తాను ఎప్పుడు సిద్ధంగా ఉంటానని కూడా తెలిపింది. మరి బస్తీ లో పిల్లల కోసం ఉపాసన చేస్తున్న మంచి పనికి ప్రతి ఒక్కరు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తూ ఉండడం గమనార్హం. ఏది ఏమైనా సాయం చేయాలనీ గుణం ఉండాలి కానీ ఏదైనా సాధ్యమవుతుందని ఉపాసన నిరూపించింది.