టెక్కలిలో అచ్చెన్నకు దువ్వాడ బ్రేకులు..?

టెక్కలి..టీడీపీకి ఉన్న కంచుకోటల్లో ఇది ఒకటి..పైగా ఇది కింజరాపు ఫ్యామిలీ అడ్డాగా ఉంది. అచ్చెన్నాయుడు వరుసగా ఇక్కడ సత్తా చాటుతున్నారు. గత ఎన్నికల్లో కూడా జగన్ గాలిని తట్టుకుని విజయం సాధించారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక అచ్చెన్నకు బ్రేకులు వేయాలని జగన్ గట్టిగానే ట్రై చేస్తూ వచ్చారు. ఇదే క్రమంలో ఈ‌ఎస్‌ఐ స్కామ్‌ అని చెప్పి జైలుకు కూడా వెళ్లారు. కానీ అందులో అచ్చెన్న పాత్ర ఉందనే విషయం మాత్రం తేల్చలేకపోయారు.

జైలు నుంచి వచ్చాక మరింత దూకుడుగా అచ్చెన్న ముందుకెళుతున్నారు…పైగా ఏపీ టీడీపీ అధ్యక్షుడుగా దూసుకెళుతున్నారు. ఇలా దూకుడుగా ఉన్న అచ్చెన్నకు సొంత స్థానంలోనే చెక్ పెట్టాలని చెప్పి..వైసీపీ టెక్కలిపై ఫోకస్ పెట్టింది. అలాగే అక్కడకు దువ్వాడ శ్రీనివాస్‌ని ఇంచార్జ్ గా పంపింది. ఆయనకు ఎమ్మెల్సీ కూడా ఇచ్చింది. ఇక అధికారంలో ఉండటం, పైగా పదవులు ఉండటంతో దువ్వాడ మరింత దూకుడుగా ముందుకెళుతున్నారు. ఇక అచ్చెన్నని ఏ స్థాయిలో టార్గెట్ చేసి విరుచుకుపడతారో చెప్పాల్సిన పని లేదు.

ఇక బూతులతో అచ్చెన్నపై విరుచుకుపడతారు. అలాగే టెక్కలిలో బలమైన టీడీపీ శ్రేణులని వైసీపీలోకి తీసుకొచ్చే కార్యక్రమాలు చేస్తున్నారు. అధికార బలంతో టెక్కలిలో బలం పెంచుకోవాలని చూస్తున్నారు. పైగా అచ్చెన్న ఏపీ టీడీపీ అధ్యక్షుడు అయ్యాక టెక్కలిలో పెద్దగా ఉండటం లేదనే టాక్ వచ్చింది. దీంతో టెక్కలిపై దువ్వాడకు పట్టు సాధించే ఛాన్స్ దక్కింది.

కానీ అధికార బలం వల్ల పట్టు సాధించినట్లు కనిపిస్తున్నారు గాని..క్షేత్ర స్థాయిలో మాత్రం అచ్చెన్న బలం మాత్రం తగ్గించలేదని అర్ధమవుతుంది. టెక్కలి ప్రజలు ఇప్పటికీ అచ్చెన్న వైపే ఉన్నారని, తాజాగా ఆయన నియోజకవర్గంలో పర్యటన బట్టి అర్ధమైంది. ఆయన కోటబొమ్మాళి సెంటర్‌లో ర్యాలీ చేస్తే పెద్ద ఎత్తున జనం వచ్చారు. దీని బట్టి చూస్తే టెక్కలిలో అచ్చెన్నకు బ్రేకులు వేయడం దువ్వాడకు సాధ్యం కాదని అర్ధమవుతుంది. పైగా ఇటీవల వస్తున్న సర్వేల్లో టెక్కలిలో టీడీపీ గెలుపు ఖాయమని తేలింది.