బిగ్ షాక్..బుచ్చయ్యకు ఛాన్స్ ఉండదా..!

ఏపీ రాజకీయాల్లో బుచ్చయ్య చౌదరీ సూపర్ సీనియర్ నాయకుడు…దశాబ్దాల కాలం నుంచి రాజకీయం చేస్తున్న నేత. టీడీపీలో మొదట నుంచి పనిచేస్తున్న బుచ్చయ్యకు అదిరిపోయే విజయాలు వచ్చాయి. మొదట రాజమండ్రి సిటీలో సత్తా చాటుతూ వచ్చారు. నాలుగు సార్లు సిటీలో గెలిచారు…ఇక 2014 ఎన్నికల్లో పొత్తులో భాగంగా సిటీ సీటు బీజేపీకి దక్కింది. దీంతో బుచ్చయ్యని రాజమండ్రి రూరల్‌కు పంపించారు. రూరల్‌లో కూడా బుచ్చయ్య సత్తా చాటారు.

అయితే ఆయన మనసు మొత్తం సిటీ పైనే ఉంది…ఎలాగైనా సిటీ సీటు దక్కించుకోవాలని అనుకున్నారు. కానీ 2019 ఎన్నికల్లో అక్కడ ఆదిరెడ్డి ఫ్యామిలీ వచ్చింది. అదిరెడ్డి భవానీ పోటీ చేసి గెలిచారు. దీంతో మళ్ళీ బుచ్చయ్య రూరల్‌లోనే పోటీ చేశారు. జగన్ గాలిలో కూడా గెలిచారు. కానీ ఈ సారి రూరల్‌లో బుచ్చయ్యకు గెలుపు కాస్త కష్టమయ్యేలా ఉండని తెలుస్తోంది. ఎందుకంటే ఇక్కడ వైసీపీ బలపడటంతో పాటు, జనసేన వేగంగా పుంజుకుంటుంది.

వైసీపీ కంటే జనసేనతోనే బుచ్చయ్యకు రిస్క్ ఎక్కువ ఉంది..ఎందుకంటే ఇక్కడ జనసేనకు ఓటింగ్ ఎక్కువ. గత ఎన్నికల్లో బుచ్చయ్యకు 74 వేల ఓట్లు పడితే..వైసీపీకి 63 వేలు, జనసేనకు 42 వేల ఓట్లు పడ్డాయి. అయితే ఇప్పుడు జనసేన ఓటు బ్యాంక్ ఇంకా పెరిగిందని తాజా ఆత్మసాక్షి సర్వేలో తేలింది. రాజమండ్రి రూరల్ సీటుని జనసేన కైవసం చేసుకునే అవకాశాలు ఉన్నాయని తేల్చి చెప్పింది.

అయితే జనసేన విడిగా పోటీ చేస్తే మాత్రం బుచ్చయ్యకు షాక్ తగిలేలా లేదు…గెలిస్తే జనసేన గెలుస్తుంది లేదంటే ఓట్లు చీలిపోయి వైసీపీకి గెలిచే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అంటే జనసేన కలిస్తేనే బుచ్చయ్యకు ప్లస్. అప్పుడు ఢోకా లేకుండా గెలుస్తారు. అదే సమయంలో ఎక్కువ ఓట్లు ఉన్నాయని చెప్పి ఈ సీటు జనసేన అడిగే అవకాశాలు కూడా లేకపోలేదు. మరి చూడాలి బుచ్చయ్యకు నెక్స్ట్ పోటీ చేసే ఛాన్స్‌తో పాటు గెలిచే ఛాన్స్ ఉంటుందో లేదో.