రాప్తాడు రాజకీయం…నిలిచేదెవరు?

రాప్తాడు రాజకీయం రోజురోజుకూ వేడెక్కుతుంది…రాష్ట్ర స్థాయిలో రాప్తాడు రాజకీయం హైలైట్ అవుతుంది..అక్కడ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, పరిటాల శ్రీరామ్ ల మధ్య వార్ గట్టిగానే నడుస్తోంది…రెండు పార్టీల మధ్య రాజకీయం కాస్త…ఇద్దరు వ్యక్తుల మధ్య జరుగుతుంది. రాప్తాడు అంటే పరిటాల ఫ్యామిలీ కంచుకోట అనే సంగతి తెలిసిందే…గతలో రవీంద్ర..ఆ తర్వాత పరిటాల సునీతమ్మ అక్కడ సత్తా చాటారు. ఇక వరుసగా ప్రకాష్ పోటీ చేస్తూ ఓడిపోయారు.

కానీ 2019 ఎన్నికల్లో తొలిసారి ప్రకాష్ రెడ్డికి విజయం దక్కింది…అది కూడా పరిటాల వారసుడైన శ్రీరామ్ పై గెలిచారు. గెలిచిన దగ్గర నుంచి ప్రకాష్ దూకుడుగా రాజకీయం చేస్తున్నారు…తన బలాన్ని మరింత పెంచుకునే దిశగా వెళుతున్నారు…ఎక్కడకక్కడ పరిటాల ఫ్యామిలీకి చెక్ పెట్టే దిశగా వెళుతున్నారు.

ఇక ప్రకాష్ కు ధీటుగా శ్రీరామ్ కూడా పనిచేస్తున్నరు…ఓ వైపు సునీతమ్మ, మరోవైపు శ్రీరామ్ లు రాప్తాడులో మళ్ళీ టీడీపీని బలోపేతం చేసే కార్యక్రమం చేస్తున్నారు. అసలు ప్రకాష్, పరిటాల ఫ్యామిలీ మధ్య పెద్ద యుద్ధమే నడుస్తోంది. ఈ యుద్ధంలో అధికారులు బలి అయ్యే పరిస్తితి కనిపిస్తోంది. ఎందుకంటే కొందరు…ప్రకాష్ రెడ్డికి అనుకూలంగా ఉంటే..మరికొందరు పరిటాల ఫ్యామిలీకి అనుకూలంగా నడుస్తున్నట్లు కనిపిస్తున్నారు.

ఇక తమ వర్గం వారిని టచ్ చేస్తే వారిని వదిలే ప్రసక్తి లేదని శ్రీరామ్ వార్నింగ్ ఇస్తున్నారు..అటు దమ్ముంటే గన్ మెన్లని తీసి రావాలని ప్రకాష్ సవాల్ విసురుతున్నారు. అలాగే తనపై ఎవరు పోటీ చేస్తారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే పరిటాల ఫ్యామిలీ..రాప్తాడుతో పాటు ధర్మవరం బాధ్యతలు కూడా చూసుకుంటున్నారు.

నెక్స్ట్ ఎన్నికల్లో ధర్మవరంలో శ్రీరామ్, రాప్తాడులో సునీతమ్మ పోటీ చేస్తారని…పరిటాల వర్గం చెబుతుంది..కానీ దీనిపై టీడీపీ అధిష్టానం మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. అందుకే ప్రకాష్ సవాల్ విసురుతున్నారు. మరి రాప్తాడు బరిలో ఎవరు దిగుతారో చూడాలి…ఇక ఎవరు పోటీ చేసిన ప్రకాష్ రెడ్డికి చెక్ పెట్టగలరో లేదో చూడాలి.