ASIA CUP 2022: ఆసియా కప్‌లో భార‌త్‌కు ప‌సికూన స‌వాల్‌

ఆసియా కప్-2022 కు క్వాలీఫ‌యింగ్ రౌండ్‌లో విజేత హాంకాంగ్‌ ఆరో జట్టుగా అర్హత సాధించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌తో జరిగిన చివ‌రి మ్యాచ్‌లో ఘ‌న‌విజ‌యం సాధించిన హాంకాంగ్ క్వాలీఫైయింగ్ రౌండ్‌లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచి ఆసియాక‌ప్‌లో అడుగు పెట్టింది. ఈ క‌ప్‌లో హాకాంగ్ భార‌త్‌, పాకిస్తాన్ జ‌ట్లు ఉన్న గ్రూప్ ఏలో ఉంది.

Singapore Vs Kuwait Live Streaming Details- When And Where To Watch Asia  Cup Qualifier Live In Your Country? Asia Cup 2022 Qualifier, Match 5 - Golf  Single Player

హాకాంగ్ భార‌త్‌, పాకిస్తాన్‌తో రెండు మ్యాచ్‌లు ఆడుతుంది. హాంకాంగ్‌ తమ తొలి మ్యాచ్‌లో ఆగస్టు 31న ఇండియాతో, ఆ త‌ర్వాత రెండో మ్యాచ్ పాకిస్తాన్‌తో ఆడుతుంది. అయితే హాంకాంగ్‌ను త‌క్కువ అంచ‌నా వేయ‌డానికి వీల్లేదు. గ‌త ఆసియా క‌ప్‌లో 50 ఓవ‌ర్ల మ్యాచ్‌లోనే హాంకాంగ్ భార‌త్‌ను దాదాపు ఓడించినంత ప‌నిచేసింది.

Asia Cup 2022: SWOT Analysis of Team India's Squad

ఆ మ్యాచ్‌లో ఓపెనర్ల వీర‌విహారంతో హాంకాంగ్ భార‌త్ భారీ స్కోరు కూడా క్రాస్ చేస్తుంద‌నే అనుకున్నారు. అయితే చివ‌ర్లో వికెట్లు ప‌డ‌డంతో భార‌త్ గెలిచింది. హాంకాంగ్‌ను భార‌త్ ఏ మాత్రం త‌క్కువ అంచ‌నా వేయ‌డానికి వీల్లేదు. ఇక ఆసియాకప్‌-2022 ఆగస్టు 27 నుంచి యూఏఈ వేదికాగా ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.