బ్లాక్ బస్టర్ మూవీ ఆది ను రిజెక్ట్ చేద్దామనుకున్న ఎన్టీఆర్.. రీజన్ తెలిస్తే షాక్..!!

ఎన్టీఆర్ తన కెరీర్లో ఎప్పుడూ లేనంతగా ప్రస్తుతం ఫుల్ ఫాంలో ఉన్న విషయం తెలిసిందే. ఎప్పుడైతే రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారో ఇక అప్పటినుంచి ఈయన వరుస స్టార్ డైరెక్టర్లకు అవకాశాన్ని ఇస్తూ దూసుకుపోతున్నాడు. ఇకపోతే టెంపర్ సినిమా తర్వాత నుంచి ఈయనకు వరుసగా ఆరు హిట్లు రావడం గమనార్హం. ఇప్పుడున్న పరిస్థితులలో 6 హిట్లు అంటే అది మామూలు విషయం కాదు.. టెంపర్, నాన్నకు ప్రేమతో , జనతా గ్యారేజ్, జై లవకుశ , అరవింద సమేత, తాజాగా ఆర్ ఆర్ ఆర్.. ఈ ఆరు సినిమాలు వరుసగా విజయాలను సాధించి ఎన్టీఆర్ కెరియర్లో సినీ గ్రాఫ్ అమాంతం పెంచేశాయి.

కానీ ఎన్టీఆర్ కి సరిగ్గా 21 సంవత్సరాల వయసులో స్టూడెంట్ నెంబర్ వన్, ఆది, సింహాద్రి వంటి సినిమాలతో హ్యాట్రిక్ విజయాలను సొంతం చేసుకున్నాడు. అంటే ఎన్టీఆర్ కెరియర్లో ఈ మూడు సినిమాలు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అని చెప్పవచ్చు . ఇక అందులో రెండు సినిమాలకు రాజమౌళి దర్శకత్వం వహించగా ఈ సినిమాకి వి.వి.వినాయక్ దర్శకుడిగా పని చేశారు. చిత్రమేమిటంటే దర్శకులుగా అటు రాజమౌళికి , ఇటు వి వినాయకు ఇద్దరి కెరీర్లు కూడా ఎన్టీఆర్ తోనే మొదలు కావడం గమనార్హం. అయితే గతంలో ఎన్టీఆర్ ఆది సినిమా ను రిజెక్ట్ చేద్దామని అనుకున్నారట. ఇక అందుకు గల రీజన్ కూడా లేకపోలేదు.

ఇక ఎన్టీఆర్ స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా షూటింగ్ ఫారిన్లో జరుగుతున్న సమయంలో.. నల్లమలపు శ్రీనివాస్ (బుజ్జి) నిర్మిస్తోన్న చెప్పాలని ఉంది సినిమా షూటింగ్ కూడా అదే స్పాట్లో జరుగుతోందట. ఇక ఈ సినిమాకి చంద్ర మహేష్ దర్శకుడు.. ఆయన దగ్గర వివి వినాయక్ అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసేవారు. అదే సమయంలో బుజ్జి ఎన్టీఆర్ కు పరిచయం చేసుకొని. వినాయక్ ని కూడా పరిచయం చేశారు. ఇక ఈ నేపథ్యంలోనే మీకోసం అద్భుతమైన కథ వినాయక్ రెడీ చేశాడు. మీరు పర్మిషన్ ఇస్తే మీకు కథ చెబుతాడట అని చెప్పాడు బుజ్జి.

వివి వినాయక్ ని చూస్తే డైరెక్టర్ లాగా ఎన్టీఆర్ కి అనిపించలేదట. ఇక ఇండియాకు వచ్చాక కూడా బుజ్జి పదేపదే ఎన్టీఆర్ ఇంటికి ఫోన్ చేస్తూ ఉండడంతో విసుగెత్తిపోయిన ఆయన తల్లి షాలిని ఒరేయ్ ఎవరో బుజ్జి అట.. పదేపదే ఫోన్ చేసి విసిగిస్తున్నాడు అని చెప్పడంతో చివరికి ఎన్టీఆర్ వాళ్ళని రమ్మని..కథ నచ్చలేదు అని చెప్పి పంపిద్దాం అని అనుకున్నాడట. ఇక ఎందుకో ఫారిన్లో వినాయక్ ను ఇతడు డైరెక్టరా అని అనుకోవడం.. అప్పటికి వినాయక ఒక్క సినిమా కూడా చేసి ఉండకపోవడంతో ఎన్టీఆర్ కి కూడా పెద్దగా అంచనాలు లేవు.

ఇక సరే ఒక రోజు కథ చెప్పడానికి ఎన్టీఆర్ వినాయక్ ని రమ్మన్నాడట. పది నిమిషాలు మెయిన్ లైన్ చెప్పేయ్ అని అన్నాడట. అది కూడా కథ నచ్చలేదు అని చెప్పి పంపించడానికి ఎన్టీఆర్ అలా అన్నాడట. ఇక అప్పుడు వినాయక్ సార్ పది నిమిషాలు టైం ఇవ్వండి .. ఇంట్రడక్షన్ మాత్రమే చెబుతాను అని ఇంట్రడక్షన్ సీన్ చెప్పగా ఎన్టీఆర్ ఫిదా అయిపోయాడు. అలా పది నిమిషాలు కాస్తా మూడు గంటలపాటు చాలా ఆసక్తిగా స్టోరీని వింటూనే ఉన్నాడట ఎన్టీఆర్.

ఇక కథ మొత్తం చెప్పగానే ఎన్టీఆర్ వెంటనే వినాయక్ ను హత్తుకొని మనం ఈ సినిమా చేస్తున్నామని చెప్పాడట. ఇక ఎన్టీఆర్ తో పాటు కథలు విన్న ఇప్పటి గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని కూడా ఇంత చిన్న వయసులో అంత పెద్ద బరువైన స్టోరీ లో ఎన్టీఆర్ సెట్ అవుతాడా..? ఏదైనా లవ్ స్టోరీ ఉంటే బాగుంటుందని చెప్పారట. అలా హీరో, హీరోయిన్ కి మధ్య ఒక అందమైన లవ్ స్టోరీ ని సెట్ చేసి 2002 మార్చి 28 వ తేదీన విడుదలైన ఈ సినిమా చరిత్ర తిరగరాసేలా హిట్టయింది. అంతేకాదు 98 కేంద్రాలలో 100 రోజులు ఆడి రికార్డులు బ్రేక్ చేసింది.